breaking news
thunder strom
-
లైవ్ మ్యాచ్.. హఠాత్తుగా పిడుగు; ఫుట్‌బాలర్ మృత్యువాత!
దక్షిణ థాయ్‌లాండ్‌లో ఫుట్‌బాల్ ఆటలో విషాదం నెలకొంది. గోలోక్ ఎఫ్ఏ కప్-2026 సెమీఫైనల్ సందర్భంగా లైవ్ మ్యాచ్ జరుగు తుండగా, హఠాత్తుగా మైదానంలో పిడుగు పడింది. ఈ విషాదకర ఘటనలో 24 ఏళ్ల ఫుట్‌బాలర్ సోఫ్వాన్ మృతి చెందగా, మరో 12 మంది ఆటగాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. పిడుగుపడిన భయానక దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి.పిడుగుపాటుకు మైదానంలోనే కుప్పకూలిన సోఫ్వాన్‌కు సహచర ఆటగాళ్లు, అత్యవసర మెడికల్ బృందం సీపీఆర్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే అతడు మరణించినట్లు తేలింది. ఇక పిడుగు పాటుకు గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ ప్రమాదంలో గాయపడిన 12 మంది ఆటగాళ్లలో ఒక మలేషియా క్రీడాకారుడు కూడా ఉన్నాడని, ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని స్థానిక పోలీస్ చీఫ్ థున్ సిరిఖుంట్ తెలిపారు. మరణించిన వింగర్ సొఫ్వాన్ అవాయే ఇటీవలే థాయ్ థర్డ్- టియర్ క్లబ్ అయిన 'యాలా ఎఫ్‌సీ'కి సైన్ చేశాడు. అతని హఠాన్మరణం పట్ల యాలా ఎఫ్‌సీ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, అతని కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని ప్రకటించింది. ఇక దక్షిణ థాయ్‌లాండ్ సరిహద్దులో జరిగే ఫుట్‌బాల్ టోర్నమెంట్లలో అతిపెద్ద టోర్నీ ఇదే. ఈ టోర్నీలో థాయ్‌లాండ్ సహా మలేషియా ఆటగాళ్లు కూడా తలపడుతుంటారు. అయితే మ్యాచ్‌కు ముందు భారీ వర్షం కురిసినట్లు తెలుస్తోంది. వర్షం ఆగిపోవడంతో మ్యాచ్ నిర్వహించామని, ఇలా హఠాత్తుగా పిడుగు మైదానంలో పడుతుందని ఊహించలేకపోయామని, ఎంతో భవిష్యత్తు ఉన్న సోఫ్వాన్‌ను కోల్పోవడం బాధాకరమని గోలోక్ క్లబ్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు.🇹🇭 Horrifying moment from Thailand when a freak lightning strike kills a football player and injures 12 others during a match pic.twitter.com/lAwYJxhtUo— Visegrád 24 (@visegrad24) August 5, 2026పిడుగు ప్రమాదాలు కొత్తేమీ కాదుఇక థాయ్‌లాండ్‌లో ఇలాంటి పిడుగుపాటు ప్రమాదాలు జరగడం కొత్తేమీ కాదు. డిసీజ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ నివేదిక ప్రకారం.. 2020 నుండి 2024 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 283 మంది పిడుగుపాటుకు గురయ్యారు, వారిలో చాలా మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది మే నెలలోనే లంపాంగ్, ఉథాయ్ థానీ ప్రావిన్సులలో వేర్వేరు ఘటనల్లో పిడుగుపడి గర్భిణి సహా ముగ్గురు మరణించారు. Safwan Awae, a player of a Thai League 3 club, has tragically 𝐏𝐀𝐒𝐒𝐄𝐃 𝐀𝐖𝐀𝐘 after being struck by lightning while playing a game in the Kolok FA Cup in Thailand. 💔Our thoughts and prayers go out to his family & friends. 🙏 pic.twitter.com/Rkc11bLflp— CentreGoals. (@centregoals) August 5, 2026Read: టీ20 క్రికెట్లో జోస్ బట్లర్ ప్రపంచ రికార్డు -
వాతావరణ శాఖ అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగు హెచ్చరికలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, మన్యం,కాకినాడ,కోనసీమ,తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రధానంగా రానున్న మూడుగంటల్లో అరకు, చింతపల్లె, నర్సీపట్నం, ఎలమంచిలి, అనకాపల్లి, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకి వెళ్లకూడదని సూచించింది. చెట్లకింద హోర్డింగుల వద్ద నిల్చోకూడదని పేర్కొంది. -
మంచుతుఫాన్ ఎఫెక్ట్.. USAకు ఫ్లైట్స్ క్యాన్సిల్
అమెరికా న్యూయార్క్‌లో భారీ మంచు తుఫాను పొంచి ఉన్న నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 25, 26 తేదీలలో అక్కడికి వెళ్లే అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల భద్రత నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం అమెరికాకు మంచు తుపానులు భయం పట్టుకుంది. ఈ వారాతంలో ఆ దేశం తీవ్ర మంచుతుపాను ఎదుర్కొనే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో USA అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం స్పందించారు. తుపానును ఎదుర్కొవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సన్నద్ధమైందని ప్రకటించారు. అయితే దీని ప్రభావం భారత్‌లోని విమానయాన సంస్థలపై సైతం పడింది. మంచు తుఫాన్ నేపథ్యంలో న్యూయార్క్ వెళ్లే విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.ఈ విమానాల రద్దుపై వివరణ ఇస్తూ సంస్థ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. "అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాలలో రేపు, ఎల్లుండి తీవ్ర మంచుతుఫాను ప్రభావం ఉండనుంది. యుఎస్ తూర్పు తీరంలో ఈ ప్రభావం మరింత అధికంగా ఉండనుంది. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా జనవరి 25,26 తేదీలలో అక్కడికి ప్రయాణించే విమానాలను రద్దు చేస్తున్నాం. ఈ క్యాన్సిలేషన్‌పై పూర్తి సమాచారం మా సిబ్బంది ప్రయాణికులకు వ్యక్తిగతంగా అందిస్తుంది". అని ఎక్స్‌లో ఎయిర్ఇండియా పోస్ట్ చేసింది.అయితే ప్రస్తుతం రాబోయే మంచు తుఫాన్ అమెరికాలో 2/3 మందిని ఎఫెక్ట్ చేస్తుందని సీఎన్ఎన్ కథనం ప్రచురించింది. ప్రస్తుతం వచ్చే మంచుతుఫాన్ టెక్సాన్ నుంచి ఇంగ్లాండ్ వరకూ దాదాపు 2వేల కిలోమీటర్ల మైళ్లు ప్రయాణించనున్నట్లు పేర్కొంది. దీనివల్ల దేశంలోనే విద్యుత్‌వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని తెలిపింది. -
దుబాయ్‌లో భారీ వర్షం.. బుర్జ్ ఖలీఫా పరిస్థితి ఇది..
దుబాయ్ (Dubai)ని భారీ వర్షం ముంచెత్తింది. ఎడతెరిపిలేని కుండపోత వర్షం కారణంగా దుబాయ్ వీధులు చెరువులను తలపిస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి కాలనీలు నీట మునిగాయి. పలుచోట్ల పిడుగులతో (Lightning strikes) కూడిన వర్షం కురిసింది. వర్షం సమయంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా (Burj Khalifa)ను పిడుగు తాకింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. దుబాయ్‌లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. వర్షం సమయంలోనే దుబాయ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫాపై పిడుగు పడిన దృశ్యాన్ని స్వయంగా ఆ దేశ యువరాజు (Dubai crown prince) షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. భారీ వర్షం కురుస్తుండగా, ఉరుముల గర్జనల మధ్య ఆకాశం నుంచి వచ్చిన పిడుగు నేరుగా బుర్జ్ ఖలీఫా పైభాగాన్ని తాకింది. ఈ వీడియోకి ‘దుబాయ్’ అనే చిన్న క్యాప్షన్ మాత్రమే జోడించారు యువరాజు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లు, ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాగా, తరచూ పిడుగులు పడుతున్నా, భవనానికి ఎలాంటి నష్టం జరగకుండా ప్రత్యేకమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు.Heavy rain early this morning led to localized flooding across parts of Dubai and other UAE areas. Waterlogging was reported on several roads as authorities issued weather warnings and urged residents to stay cautious and avoid unnecessary travel.Emergency teams are monitoring… pic.twitter.com/dwSYOXuT4Y— Mazhar Khan (@Mazhar4justice) December 19, 2025ఇక, ప్రస్తుతం యూఏఈలో వాతావరణం అస్థిరంగా ఉంది. 'అల్ బషాయర్' అల్పపీడనం కారణంగా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు.. ఎడతెరిపిలేని వర్షం కారణంగా రాస్ అల్ ఖైమాలో గోడ కూలిపోవడంతో భారత్‌కు చెందిన 27 ఏళ్ల సల్మాన్ ఫరీజ్ మృతి చెందినట్టు స్థానిక అధికారులు తెలిపారు. ఎడతెరిపిలేని వర్షం కారణంగా విమానాలు, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. First Rain in Dubai this year. Thank you, God, for this life-giving rain! We praise You for replenishing the earth, and bringing relief and new life, Thank you for every drop that nourishes our plants, fills our rivers, and refreshes our souls, making us remember our dependence… pic.twitter.com/AVCtSWysVg— Dolly_Pizzle of Chelsea💙🦅 (@harbyhorlar2) December 19, 2025Shaikh Hamdan posts video of lightning strike on Burj KhalifaShaikh Hamdan bin Mohammed bin Rashid Al Maktoum, Crown Prince of Dubai, posted a video of lightning striking the tip of the world's tallest building, Burj Khalifa, as heavy rain hit parts of Dubai and the rest of the… pic.twitter.com/wHZpC49W3I— GDN Online (@GDNonline) December 18, 2025 -
కాలిఫోర్నియాలో వరద బీభత్సం.. నగరాన్ని వీడాలని హెచ్చరిక
కాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికాను భీకర వరదలు ముంచెత్తాయి. కాలిఫోరి్నయా, లాస్ ఏంజెలిస్‌లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాలిఫోర్నియా జనాభాలో ఏకంగా 90 శాతం మంది ప్రజలు వరద ముప్పును ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. భారీ వర్షాల వల్ల వరదలు ముంచెత్తుతున్నాయి. పలు ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. More deadly storms have slammed the California coast with torrential rains and thunderstorms, causing massive flooding, landslides and widespread power outages. At least 25 million residents are under flood advisories while more than 145,000 are still without power. pic.twitter.com/ma9fEewj2X — CBS Evening News (@CBSEveningNews) January 11, 2023 భారీ వర్షాల నేపథ్యంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో దాదాపు 25 వేల మందిని ప్రభుత్వ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం. హాలీవుడ్ సినీ ప్రముఖులు నివసించే మాంటెసిటో నగరంలో పరిస్థితి మరింత దారుణంగా మారిందని అధికారులు వెల్లడించారు. బురద ముప్పు పొంచి ఉందని, ప్రజలు ఈ నగరాన్ని వెంటనే వీడాలని అత్యవసర హెచ్చరిక జారీ చేశారు. కాలిఫోర్నియాలో 17 ప్రాంతాల్లో భీకర వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కాలిఫోర్నియాలో పలు ప్రాంతాలు ఇప్పటికే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో బురద ప్రవాహం పెరిగింది. San Francisco roads are swallowed by the flood. Stay inside or go somewhere safe. #SanFrancisco #California #Weather #Flooding #Mothernature #Waterpark #SoakCity #StayDry pic.twitter.com/tNhIFDOXYR — Sh*t That’s Interesting (@SUDN2K) January 10, 2023 -
ఇళ్లపై ఈ ఏర్పాటుతో పిడుగుల నుంచి రక్షణ పొందొచ్చు
వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చి బైక్‌పై తిరిగి వెళ్తుండగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఫ్లైఓవర్‌పై తల్లికొడుకులు సోమవారం పిడుగుపాటుకు మృతి చెందగా.. తండ్రి పరిస్థితి విషమంగా మారింది. ఇదే నెలలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో పొలానికి వెళ్లి తిరిగి వస్తున్న ఎడ్లబండి పిడుగు వేయడంతో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. జూలై 7న ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పిడుగుపాటుకు ఆరుగురు మృతి చెందగా.. పలుచోట్ల పశువులు బలయ్యాయి. ఇలా ఏటా వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులతో పిడుగులు పడి పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. వర్షాకాలంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే రైతులు, కూలీలు, పశువుల కాపరులు, రోడ్లపై వెళ్లే వాహనదారులు అధికంగా పిడుగుపాటుకు గురవుతున్నారు. అవగాహన కలిగి ఉంటే పిడుగుపాటు నుంచి రక్షించుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. – మంచిర్యాలటౌన్ ప్రధాన కారణం.. వర్షంపడే సమయంలో వాతావరణంలో పీడనం, ఉష్ణోగ్రతలో కలిగే మార్పులు ప్రధానంగా పిడుగులకు కారణమవుతాయి. పిడుగు అంటే ఆకాశంలో సహజసిద్ధంగా ఉత్పన్నమయ్యే విద్యుదుత్పాతం. పిడుగు పడే సమయంలో ఉత్పత్తయ్యే శబ్దం లక్షల డెసిబిల్స్‌లో ఉంటుంది. ఒక మిల్లీ సెకన్ కాలంలో మెరుపులతో కూడిన పిడుగు 20 ఆంపియర్ల విద్యుత్ ప్రవాహాన్ని విడుదల చేస్తుంది. అప్పుడు ఏర్పడే శక్తి క్షేత్ర మీటర్‌కు 2 లక్షల వోల్టులతో సమానం.ఇది ఒక లక్ష కిలోమీటర్ల పొడవు ఉంటుంది. రెండు మేఘాల మధ్య అయితే తక్కువలో తక్కువ 7 నుంచి 140 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మేఘాలు ఢీకొన్నప్పుడు జనించే విద్యుత్, ధ్వని తరంగాలు సన్నటి మార్గం గుండా భూమిని చేరుతాయి. ఆ సమయంలో అవి ప్రవహించే మార్గంలో 50 వేల డిగ్రీల వేడి నమోదవుతుంది. అలా ఉపరితలం మీద నుంచి ఎత్తయిన చెట్లు, ఇనుప స్తంభాలు, ఆలయ ధ్వజస్తంభాలు వంటి వాటి ద్వారా తరంగాలు భూమిలోకి చేరుతాయి. ఆ సమయంలో సమీపంలో ఉన్న మనుషులు, జంతువులు కూడా వాటికి సాధనంగా మారుతారు. కాపర్ ఎర్తింగ్.. పిడుగుపాటు నుంచి తప్పించుకునేందుకు కాపర్ ఎర్త్ (రాగి తీగ)ను ఏర్పాటు చేసుకోవాలి. దీనిని భవనం పైనుంచి భూమిలోపలి వరకు ఏర్పాటు చేయాలి. కిలోమీటరు దూరంలో పిడుగుపడినా భూమి ఆకర్షిస్తుంది. రాగితీగను ఏర్పాటు చేసుకునే సమయంలో ఉప్పుతోపాటు బొగ్గు కలిపి అందులో వేయాలి. శక్తివంతమైన విద్యుత్ ప్రవాహం పిడుగు రూపంలో కిందికి వచ్చినప్పుడు కాపర్(రాగి) తీగ ఆపే అవకాశం ఉంది. టవర్లు, సినిమా హాళ్ల వద్ద ఇలాంటివి ఏర్పాటు చేస్తారు. భవనాలు, పరిశ్రమలు అంతస్తులపై రాగి కడ్డీలను ఏర్పాటు చేసుకోవాలి. జాగ్రత్తలు పాటించాలి ► ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్న సమయంలో చెట్ల కిందకు వెళ్లొద్దు. విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండరాదు. చెట్లు, స్తంభాలకు దూరంగా ఉండాలి. ► ఇంట్లో ఉన్న స్విచ్‌బోర్డుల నుంచి ప్లగ్గు లు తొలగించాలి. టీవీలకు ఉన్న కేబు ల్ తీగలు తొలగించాలి. అలాగే ఉంచితే ఎలక్ట్రికల్ వస్తు సామగ్రి దెబ్బతినే ప్రమాదం ఉంది. ► విద్యుత్ స్తంభాలు పిడుగులను ఆకర్షించే అవకాశం ఉంది. ► ఉరుములతో కూడిన వర్షం పడుతుంటే కిటికీలు, తలుపుల వద్ద ఉండి బయటకు చూడవద్దు. కిటికీ తలుపులు మూసేయాలి. ► ఎత్తైన ప్రదేశంలో నిల్చోని ఫోన్ మాట్లాడకూడదు. ఎడ్లబండ్లు, ద్విచక్ర వాహనాలు నడపొద్దు. ► అధిక నీరు ఉన్నచోట ఉండడంగాని, నీళ్లలో ఈత కొట్టడం చేయకూడదు. ► ఎర్తింగ్ కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమా దం. అలాంటి సమయంలో చెప్పులు లేకుండా బయటకు వెళ్లకూడదు. ఆరుబయట ఉంటే.. ► వర్షం కురిసే సమయంలో పొలాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ► పిడుగు పడే సమయంలో బయట ఉంటే అరచేతులతో చెవులు మూసుకుని, నేలపై మోకాళ్ల మీద కూర్చోని తల కిందకు వంచి ఉండాలి. ► వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలకు దూరంగా ఉండాలి. ► ఈదురుగాలులు, వర్షం పడే సమయంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ తీగల కింద ఉండొద్దు. ► గుండే జబ్బులు ఉన్నవారు వర్షం, ఉరుములు, మెరుపుల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిడుగుపాటుకు గురైతే.. ► పిడుగుపాటుకు గురైన వారు ప్రాణాపాయం నుంచి బయటపడడం అరుదు. అస్వస్థతకు గురైన వారిని వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. ► బాధితుడికి వెంటనే ప్రథమ చికిత్స అందించాలి. ► పిడుగు తాకిన ప్రదేశం తడిగా ఉంటే బాధితుడిని దుప్పటిపై పడుకొబెట్టాలి. ► ఊపిరి ఆగిపోతే బాధితుడి కృత్రిమ శ్వాస అందించాలి. ► గుండే కొట్టుకోవడంలో తేడాలు గమనిస్తే ఆస్పత్రికి తీసుకెళ్లే వరకు రెండు చేతులతో ఛాతి పైభాగాన్ని గట్టిగా ఒత్తుతూ ఉండాలి. చదవండి: బైక్‌పై వెళ్తుండగా పిడుగు పడి.. -
టూవీలర్‌పై వెళ్తున్న వ్యక్తులపై పిడుగుపాటు.. ఇద్దరు మృతి
మంచిర్యాల(ఆదిలాబాద్): మంచిర్యాల జిల్లాలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. కాగా, జిల్లా కేంద్రంలో ఓ ఫై ఓవర్ బ్రిడ్జ్‌పై వర్షంలో టూవీలర్‌పై ప్రయాణిస్తున్న ఒక కుటుంబం పిడుగు పాటుకు గురైంది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న సదరు వ్యక్తి భార్య, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరోకరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే స్థానికులు వారిని సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా, ఒకే కుటుంబంలో ఇద్దరు పిడుగుపాటుకు గురై చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చదవండి: Tragedy: వినాయక నిమజ్జన వేడుకల్లో అపశృతి -
హడలెత్తించిన పిడుగులు
సాక్షి, శ్రీకాకుళం : వాండ్రంగి, రాపాక పంచాయతీ చీడిపేటలో శనివారం సాయంత్రం కొబ్బరిచెట్లపై పిడుగులు పడ్డాయి. ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చెట్లపై మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇల్లయ్యగారిపేటలో ఓ ఇంటిపై పిడుగు పడిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. సాయంత్రం 4 గంటల సమయంలో ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై ఉరుములు, మెరుపులు వచ్చాయి. దీంతో ప్రజలంతా ఒక్కసారిగా ఇళ్లలోకి వెల్లిపోయారు. అదే సమయంలో నడిమింటి శ్రీరాములు ఇంటి మేడపై ముందుభాగాన పిడుగు పడింది. దీంతో గోడ ధ్వంసమై ఇటుకలు ఊడి బయటపడ్డాయి. సుమారు రూ. 50 వేలు నష్టం వాటిల్లిందని బాధితులు లబోదిబోమంటున్నారు. తుంగపేటలో కూలిన ఇంటిగోడ మండలంలోని తుంగపేటలో శనివారం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. నాలుగు కుటుంబాలకు చెందిన ఉమ్మడి ఇంటిగోడ కుప్పకూలింది. ఇటీవల కురిసిన చిరుజల్లులకు గోడ నానడంతో కూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ఈ సమయంలో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని యజమానులు కూన ఇందుమతి, కూన లక్ష్మిన కూన వెంకట సూర్యం, కూన రేవతిలు తెలిపారు. -
ఏపీలో ఒక్కరోజులో 41,025 పిడుగులు
-
ఏపీలో పిడుగుల వర్షం ; 12 మంది మృతి
-
పిడుగుపాటుతో రైతు మృతి
ఇచ్చాపురం (శ్రీకాకుళం): పొలంలో పనులు చేసుకుంటున్న రైతుపై పిడుగుపడటంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలో శనివారం జరిగింది. వివరాలు.. మండలంలోని కేదారిపురం గ్రామానికి చెందిన పిట్ట చిరంజీవి (45) శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో తన పొలంలో పనులు చేస్తుండగా పెద్ద శబ్దంతో ఆయనపై పిడుగుపడింది. దీంతో రైతు అక్కడికక్కడే చనిపోయాడు. ఆయనకు భార్య, ఇరవయ్యేళ్ల లోపు ఇద్దరుకుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.


