టూవీలర్‌పై వెళ్తున్న వ్యక్తులపై పిడుగుపాటు.. ఇద్దరు మృతి

Thunder Storm Tragedy In Adilabad - Sakshi

మంచిర్యాల(ఆదిలాబాద్‌)‌: మంచిర్యాల జిల్లాలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. కాగా, జిల్లా కేంద్రంలో ఓ ఫై ఓవర్‌ బ్రిడ్జ్‌పై వర్షంలో టూవీలర్‌పై ప్రయాణిస్తున్న ఒక కుటుంబం పిడుగు పాటుకు గురైంది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న సదరు వ్యక్తి భార్య, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరోకరి పరిస్థితి విషమంగా ఉంది.

వెంటనే స్థానికులు వారిని సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా, ఒకే కుటుంబంలో ఇద్దరు పిడుగుపాటుకు గురై చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

చదవండి: Tragedy: వినాయక నిమజ్జన వేడుకల్లో అపశృతి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top