పిడుగుపాటుతో రైతు మృతి | farmer dies of thunder strom | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుతో రైతు మృతి

Sep 5 2015 8:50 PM | Updated on Oct 1 2018 4:01 PM

పొలంలో పనులు చేసుకుంటున్న రైతుపై పిడుగుపడటంతో అక్కడికక్కడే చనిపోయాడు.

ఇచ్చాపురం (శ్రీకాకుళం): పొలంలో పనులు చేసుకుంటున్న రైతుపై పిడుగుపడటంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలో శనివారం జరిగింది. వివరాలు.. మండలంలోని కేదారిపురం గ్రామానికి చెందిన పిట్ట చిరంజీవి (45) శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో తన పొలంలో పనులు చేస్తుండగా పెద్ద శబ్దంతో ఆయనపై పిడుగుపడింది. దీంతో రైతు అక్కడికక్కడే చనిపోయాడు. ఆయనకు భార్య, ఇరవయ్యేళ్ల లోపు ఇద్దరుకుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement