
ఛత్తీస్‌గఢ్: రాయ్‌పూర్‌లోని స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం జరిగింది. స్టీల్‌ప్లాంట్‌లో నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. పలువురికి గాయపడ్డారు. శిథిలాల కింద పలువురు కార్మికులు చిక్కుకున్నారు.
ఈ ఘటన నగర శివార్లలోని సిల్తారా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న గోదావరి ఇస్పాత్ లిమిటెడ్ ప్లాంట్‌లో జరిగింది. గాయపడినవారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కూలిన శిథిలాలను తొలగిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రాయ్‌పూర్ ఎస్పీ లాల్ ఉమ్మద్ సింగ్ తెలిపారు.