జల వివాదం పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీ | A special committee to resolve the water dispute in Telugu States | Sakshi
Sakshi News home page

జల వివాదం పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీ

Jan 2 2026 5:17 PM | Updated on Jan 2 2026 5:35 PM

A special committee to resolve the water dispute in Telugu States

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించడానికి కేంద్ర జలశక్తి శాఖ కీలక నిర్ణయ తీసుకుంది. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి నలుగురు చొప్పున ప్రాతినిథ్యం కల్పించనుంది. అదేవిధంగా కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు, గోదావరి రివర్ మెనేజ్‌మెంట్ బోర్డు ఛైర్మన్లకు ఇందులో స్థానం కల్పించింది.

ఈ కమిటీకి ఛైర్మన్‌గా  కేంద్రజలసంఘం ఛైర్మన్ అతుల్‌జైన్  వ్యవహరించనున్నారు. దీని ప్రధాన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉన్న జల వివాదాల్ని పరిష్కరించడం.  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రయత్నిస్తుండగా తెలంగాణ ప్రభుత్వం దానిని వ్యతిరేకిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రజలశక్తి శాఖ ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement