శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ సభ్యుల ఆందోళన | Ysrcp Members Protest In The Ap Legislative Council | Sakshi
Sakshi News home page

శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ సభ్యుల ఆందోళన

Feb 17 2026 11:14 AM | Updated on Feb 17 2026 1:31 PM

Ysrcp Members Protest In The Ap Legislative Council

సాక్షి, అమరావతి: అసెంబ్లీ చరిత్రలోనే అసాధారణ పరిస్థితి ఏర్పడింది. ఎన్నడూ లేని రీతిలో గంట ఆలస్యంగా అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. 9 గంటలకు బదులు 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గంట ఆలస్యంగా మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం అవ్వగానే వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రకటించారు. 10 గంటలకు ప్రారంభిస్తామని డిప్యూటీ స్పీకర్‌ ప్రకటించారు. ఆలస్యానికి కారణాలపై ప్రభుత్వం స్పష్టత నివ్వలేదు.

శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ సభ్యుల ఆందోళనకు దిగారు. ఇందాపూర్‌ డెయిరీ పేరుతో హెరిటేజ్‌ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా అంశంపై చర్చకు డిమాండ్‌ చేశారు. గోవిందా గోవిందా అంటూ వైఎస్సార్‌సీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఛైర్మన్‌ పోడియం వద్ద ప్లకార్డులతో వైఎస్సార్‌సీపీ సభ్యులు నిరసనకు దిగారు. వైఎస్సార్‌సీపీ సభ్యుల ఆందోళనలతో మండలి వాయిదా పడింది.

శాసనమండలిలో YSRCP సభ్యుల ఆందోళన

 

ఆడబిడ్డ నిధి పేరుతో కూటమి మోసం: వరుదు కల్యాణి
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ... ఆడబిడ్డ నిధిపై మండలిలో తాము ప్రశ్నించామన్నారు. జిల్లా వారీగా ఖర్చుల వివరాలు చెప్పమని అడిగామని తెలిపారు. ప్రభుత్వం మూడు బడ్జెట్‌లు పెట్టింది. ఇంకా ఆడబిడ్డ నిధి పరిశీలనలో ఉందనే సమాధానం చెబుతోంది. మహానాడులో చంద్రబాబు ఇచ్చిన హామీ ఆడబిడ్డ నిధి. మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో అడ్వర్టైజ్ మెంట్ ఇచ్చి మరీ పబ్లిసిటీ చేశారు. ఇంటింటికీ వెళ్లి బాండ్లు పంచారు. కూటమి నేతల మాటలు విని ప్రజలు మోసపోయారు. ఏ మొహం పెట్టుకుని ఈరోజు ఆడబిడ్డల ముందుకు వెళ్తారు’’ అంటూ వరుదు కల్యాని నిలదీశారు.

‘‘ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఆడబిడ్డ నిధిపై క్యాబినెట్ సబ్ కమిటీ వేయాలి. ప్రభుత్వానికి ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలనే ఆలోచన లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయాలి’’ అని వరుదు కల్యాణి డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement