సాక్షి, ముంబై: ప్రముఖ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (PMS) ఫండ్ మేనేజర్ సిద్ధార్థ భయ్యాగుండెపోటుతో కన్నుమూవారు. అక్విటాస్ మేనేజింగ్ డైరెక్టర్ , చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ సిద్ధార్థ్ (47) అస్తమయం వార్తను ఎక్విటాస్ ధృవీకరించింది, డిసెంబర్ 31న న్యూజిలాండ్‌లో కుటుంబ సెలవుల్లో ఉండగా భయ్యా మరణించారని పేర్కొంది. దిగ్భ్రాంతికరం నమ్మశక్యంగా లేదు.ఒక లెజెండ్‌ను కోల్పోయామంటూ ఇండస్ట్రీ ప్రముఖలు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు.
Very very sorry to see the news of Siddhartha Bhaiya - Uffffffffffffff.
Oh God.— Samir Arora (@Iamsamirarora) January 2, 2026
సిద్ధార్థ భయ్యా అకాల మరణంపై పెట్టుబడిదారులు సంతాపం వ్యక్తం చేశారు. ఎంతో ప్రతిభావంతుడైన సిద్ధార్థ చాలా చిన్న వయసులోనే వెళ్లి పోయారంటూ విచారం వ్యక్తం చేశారు. అని అభివర్ణించారు. హీలియోస్ క్యాపిటల్‌కు చెందిన సమీర్ అరోరా ఎక్విటాస్ సిద్ధార్థ భయ్యా మరణం చాలా బాధాకరమన్నారు.
So sad to hear the news on Siddharth Bhaiyya
A very promising manager lost too soon. Just 47!— Alok Jain ⚡ (@WeekendInvestng) January 2, 2026
కేవలం 47 ఏళ్ల వయసులోనే సిద్ధార్థ భయ్యా వార్త వినడం చాలా బాధగా ఉందని ఫిన్‌ఫ్లూయెన్సర్ అలోక్ జైన్ కూడా మరణానికి సంతాపం వ్యక్తం చేశారు. జీవితం క్షణ భంగురం..ఎపుడైనా ముగిసిపోవచ్చు అనడానికి ఆయన మరణమే నిదర్శన్నారు. ఫిన్‌ఫ్లూయెన్సర్ రాజర్షి షోమ్ సూరజ్ బాలకృష్ణన్, ట్వీట్ చేసారు. పరిశ్రమలో తాను గౌరవించే వారిలో సిద్ధార్థ భయ్యా ఒకరు. ఆయన మరణం షాక్‌కు గురి చేసిందంటూ వివేక్ జోషి సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు.
కాగా 2012లో అక్విటాస్‌లో చేరడానికి ముందు, భయ్యా 2011 వరకు నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ PMS విభాగంలో పనిచేశారు. అతి పిన్న వయస్కుడైన ఫండ్ మేనేజర్లలో ఒకరిగా ఖ్యాతి గడించారు.


