తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు కీల‌క స‌మాచారం | Tirumala pushkarini to remain closed for repairs full details | Sakshi
Sakshi News home page

ఆగస్టు 1 నుంచి పుష్కరిణిలో భ‌క్తుల‌కు ప్రవేశం నిలిపివేత‌

Jul 24 2026 4:42 PM | Updated on Jul 24 2026 5:19 PM

Tirumala pushkarini to remain closed for repairs full details

సాక్షి, తిరుమల: భ‌క్తుల‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) కీల‌క స‌మాచారం వెల్ల‌డించింది. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 10 వరకు శ్రీవారి పుష్కరిణిలో భ‌క్తుల‌కు ప్రవేశం నిలిపివేస్తున్న‌ట్టు తెలిపింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో భాగంగా టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఆగస్టు 1 నుంచి 31 వ‌ర‌కు మరమ్మతు పనులు చేప‌ట్ట‌నున్నారు. 

సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు భారీ వర్షాలు, తుఫాన్లను దృష్టిలో ఉంచుకుని ముందుస్తు జాగ్రత్తలో భాగంగా పుష్కరిణిని పూర్తిగా మూసివేస్తామ‌ని టీటీడీ తెలిపింది. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 10 వరకు మొత్తం 40 రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదని వెల్ల‌డించింది.  40 రోజుల పాటు భక్తులను పుష్కరిణిలోకి అనుమతించర‌ని, శ్రీవారి భ‌క్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కాగా, శ్రీవారి బ్రహ్మూత్సవాలు ఈ ఏడాది సెప్టెంబరు 15 నుంచి జరగనున్నాయి. 

చ‌ద‌వండి: హ‌నుమాన్ విగ్ర‌హం దొంగ టీడీపీ నేత‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement