చరిత్ర సృష్టించిన భారత స్పిన్నర్‌.. 59 ఏళ్ల రికార్డు బ్రేక్‌ | Harsh Dubey Creates History With 9 For Breaks 59 YO Record | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన భారత స్పిన్నర్‌.. 59 ఏళ్ల రికార్డు బ్రేక్‌

Nov 2 2026 5:34 PM | Updated on Nov 2 2026 5:39 PM

Harsh Dubey Creates History With 9 For Breaks 59 YO Record

రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో టీమిండియా యువ ఆటగాడు, విదర్భ స్టార్‌ హర్ష్‌ దూబే అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మధ్యప్రదేశ్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో ఏకంగా తొమ్మిది వికెట్లతో చెలరేగాడు.

నాగ్‌పూర్‌ వేదికగా టాస్‌ గెలిచిన మధ్యప్రదేశ్‌ జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బౌలింగ్‌కు దిగిన విదర్భ 209 పరుగులకు మధ్యప్రదేశ్‌ను ఆలౌట్‌ చేసింది. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ హర్ష్‌ దూబే ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు వణుకు పుట్టించాడు.

మొత్తంగా 23.1 ఓవర్లు బౌలింగ్‌ చేసిన హర్ష్‌ దూబే.. 53 పరుగులు ఇచ్చి ఏకంగా తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో విదర్భ తరఫున ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు కూల్చిన, అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా చరిత్రకెక్కాడు. గతంలో ఈ రికార్డు అరుణ్‌ ఓగిరాల్‌ పేరిట ఉండేది. 1967లో అరుణ్‌ మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో 39 పరుగులు ఇచ్చి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో విదర్భ తరఫున అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన బౌలర్లు
👉హర్ష్‌ దూబే: నాగ్‌పూర్‌ వేదికగా 2026లో మధ్యప్రదేశ్‌ మీద (9-53)
👉అరుణ్‌ ఓగిరాల్‌: నాగ్‌పూర్‌ వేదికగా 1967లో మధ్యప్రదేశ్‌ మీద (8-39)
👉ప్రీతం గాంధీ: అల్వార్‌ వేదికగా 1997లో రాజస్తాన్‌ మీద (8-61).

మ్యాచ్‌ విషయానికొస్తే.. మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకు ఆలౌట్‌ కాగా.. సోమవారం నాటి తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి విదర్భ నాలుగు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. మధ్యప్రదేశ్‌ కంటే ఇంకా 153 పరుగులు వెనుకబడి ఉంది. 

ఇదీ చదవండి: IND vs NZ: షెడ్యూల్‌, జట్లు, మ్యాచ్‌ టైమింగ్స్‌, లైవ్‌స్ట్రీమింగ్‌ వివరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement