ఇటీవల కంటెంట్ క్రియేషన్‌కి మించిన క్రేజీ జాబ్ మరొకటి లేదనిపించేలా మారింది యువతకు. చాలామంది దీంతోనే స్టార్లుగా, సెలబ్రిటీలుగా మారుతున్నారు. కూడా. అయితే ఉన్నతమైన ప్రొఫెషన్‌కి మించి ఆర్జించగలమని ఈ సైంటిస్ట్ నిరూపించింది. ఆమె ఒక పక్క సైంటిస్ట్‌గా కంటెంట్ క్రియేటర్‌గా దూసుకుపోతుంది. అయితే పరిశోధన పరంగా ఆర్జించి దానికంటే..కంటెంట్ క్రియేటర్‌గానే ఎక్కువ ఆర్జించానంటూ గణాంకలతో సహా వీడియో రూపంలో వివరించి అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఆమె చెబుతుంది వింటే..నోటమాట రాదు. మరి ఆమె ఎలా ఆ రేంజ్ ఆర్జిస్తుందో సవివరంగా తెలుసుకుందామా..!
ఆ మహిళే ఆమెరికాకు చెందన ఎలెనా. ఆమె క్యాన్సర్ మందుల ఆవిష్కరణ భాగంలో పనిచేస్తోంది. విరామ సమయంలో తన భాగస్వామితో కలిసి కంటెంట్ క్రియేట్ చేస్తుంటుంది. అయితే తాను పూర్తికాల క్యాన్సర్ పరిశోధకురాలిగా కంటే..కంటెంట్‌క క్రియేటర్‌గానే ఎక్కువ ఆర్జిస్తున్నానని తెలిపింది. ఈ రెండు ఆదాయాల మధ్య వ్యత్సాసం చాలా ఆందోళనకరంగా ఉంటుందని అంటోంది.
అదేలాగో గణాంకాలతో సహా ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రూపంలో పంచుకుందామె. ఆ వీడియోలో తాను అంకాలజీ క్యాన్సర్‌కి సంబంధించిన మందుల ఆవిష్కరణ విభాగాంలో పనిచేస్తానని తనకు పన్నులు, ఇతర కటింగ్‌లు పోను చేతికి రూ. 5.5 లక్షల జీతం వరకు అందుతుందని చెప్పుకొచ్చింది. ఇక కంటెంట్ క్రియేషన్ పరంగా ఆర్జించే ఆదాయంపై ట్యాక్స్ పడలేదని ఒకవేళ పడితే అందులో తాను దాదాపు 30 నుంచి 40% వరకు చెల్లించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది.
ఇక ఆమె సోషల్ మీడియా ద్వారా కేవలం వ్యూస్ ద్వారానే కాకుండా ఆన్‌లైన్ ఉనికి, వివిధ ఫ్లాట్‌ఫాంలు, అడ్వర్టైస్‌మెంట్ తదితరాల ద్వారా కూడా ఆర్జిస్తుందామె. క్రియేటర్లు పంచుకున్న కంటెంట్‌లోని లింక్‌లను ఉపయోగించి వీక్షకులు ఉత్పత్తులను కొనుగోలు చేసే రూపంలో సుమారు 13,700. అలాగే ఫేస్‌బుక్, టిక్‌టాక్ వీడియో వ్యూస్ ఆధారంగా సుమారు రూ. 60,300.
బయోటెక్నాలజీలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారి కోసం ఒక డిజిటల్ గైడ్‌ను అమ్మడం ద్వారా కూడా సుమారు రూ. 27,600, బ్రాండ్ డీల్స్ ద్వారా రూ. 32.69 లక్షలు. అంటే ఎలెనా మొత్తం ఆర్జించే ఆదాయం సుమారు రూ. 34.18 లక్షలు పైనే ఉంటుందట. దానిలో సుమారు 30% నుంచి 40% పన్నుల రూపంలో పోగా..కనీసంలో కనీసం రూ. 20 లక్షల నుంచి రూ. 23.9 లక్షల వరకు ఆర్జించగలనని ధీమాగా చెబుతోందామె. అంటే ఎలానా పూర్తికాల వృత్తి ద్వారా కంటే కంటెంట్ క్రియేటర్‌గానే నాలుగు రెట్లు ఆదాయం ఆర్జిస్తోందన్నమాట.
ఇది తనను గందరగోళానికి, కలవరపాటుకి గురిచేస్తుంటుందని నవ్వుతూ చెబుతోంది. ఇదంతా తాను ఎందుకు చెబుతుందంటే..తనలా ఇతరులు కూడా కంటెంట్ క్రియేషన్ వైపు అడుగులు వేసేలా ప్రోత్సహించేందుకే ఇలా సోషల్ మీడియా వేదికగా గణాంకాలతో సహా పంచుకుంటున్నానని వెల్లడించిందామె. అంతేగాదు ఆ వీడియోకి క్యాప్షన్‌గా ‘ఇది చాలా భారీ మొత్తం అని నాకు తెలుసు..తనలా ఎవ్వరైనా చేయగలరని బలంగా నమ్ముతున్నా’ అని జోడించి మరి పోస్ట్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం కంటెంట్ క్రియేటర్లుగా మీ సత్తా చూపండి మరి..!.
ఇదీ చదవండి: కవలల ప్రసవానంతరం తీవ్ర సమస్యలు..కన్నీళ్లు పెట్టుకున్న ఉపాసన


