చైనా ఏఐ కలలపై ట్రంప్ ఉక్కుపాదం! | Trump admin brings new rule to block China from accessing American chips | Sakshi
Sakshi News home page

చైనా ఏఐ కలలపై ట్రంప్ ఉక్కుపాదం!

Nov 17 2026 6:58 AM | Updated on Nov 17 2026 7:02 AM

Trump admin brings new rule to block China from accessing American chips

వాషింగ్టన్‌: చైనా అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడళ్ల అభివృద్ధికి అమెరికా చిప్స్‌ను ఉపయోగించకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కొత్త ఆంక్షలు విధించింది. అమెరికాకు చెందిన అధునాతన కంప్యూటింగ్ చిప్స్, సర్వర్లను విదేశీ డేటా సెంటర్ల ద్వారా చైనా కంపెనీలు రిమోట్‌గా వినియోగించకుండా ఈ నిబంధనలు అడ్డుకోనున్నాయి. సోమవారం ప్రకటించిన ఈ నిబంధనలు 90 రోజుల్లో అమల్లోకి రానున్నాయి.

ఇప్పటికే ఎన్విడియా అత్యాధునిక చిప్స్‌ను చైనా నేరుగా కొనుగోలు చేయకుండా అమెరికా ఆంక్షలు విధించింది. అయితే ఆగ్నేయాసియాలోని డేటా సెంటర్ల నుంచి కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అద్దెకు తీసుకుని చైనా కంపెనీలు ఏఐ మోడళ్లకు శిక్షణ ఇస్తున్నాయి. తాజాగా ట్రంప్ ప్రభుత్వం ఈ మార్గానికీ అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది.

కొత్త నిబంధనల ప్రకారం విదేశీ డేటా సెంటర్లు తమ వినియోగదారులను తప్పనిసరిగా పరిశీలించాలి. చైనా, రష్యా, ఇరాన్ సంస్థలకు భారీ స్థాయిలో కంప్యూటింగ్ సేవలు అందించడంపై ఆంక్షలు ఉంటాయి. ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, థాయ్‌లాండ్, బ్రెజిల్ దేశాలకు అత్యాధునిక చిప్స్ ఎగుమతి చేయాలంటే అమెరికా లైసెన్స్ తప్పనిసరి.

మెగాస్పీడ్ ఇంటర్నేషనల్ ద్వారా ఎన్విడియా చిప్స్ చైనాకు మళ్లుతున్నాయన్న అనుమానాలు కూడా ఈ నిర్ణయానికి కారణంగా నిలిచాయి. ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ వాణిజ్య శాఖ తీరుపై విమర్శలు చేశారు. ట్రంప్ త్వరలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశం కానున్న నేపథ్యంలో ఈ ఆంక్షలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఇదీ చదవండి: లిప్ కిస్ కోరుతూ యూట్యూబర్‌కు వేధింపులు.. వీడియో వైరల్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement