పుట్టిన రోజు అనగానే చాలామంది తమకిష్టమైన గుడికి వెళ్లి తనకు నచ్చిన స్నేహితులతో గడపడం వంటివి చేస్తారు. మరికొందరు అన్నదానం వంటి సేవ కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ ఈ సీఈవో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడో తెలిస్తే షాకవ్వడం ఖాయం. ఇలా కూడా పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకుంటారా అని విస్తుపోతారు. మరి అతను ఎలా చేసుకున్నాడుంటే..
ముంబైకి చెందిన సీఈవో అభిషేక్ అగర్వాల్ తన పుట్టిరోజుని అత్యంత అసాధారణమైన రీతీలో జరుపకున్నాడు. దాని గురించి లింక్డ్‌ఇన్‌లో ఇలా పంచుకున్నారు. ఆ బర్డ్‌డే సందర్భంగా ఏకంగా నాలుగురోజుల పాటు ఆహార తీసుకోకుండా..దాదాపు 90 గంటలు ఉపవాసం చేసినట్లు తెలిపారు. తన శారీరక పరిమితులను అధిగమించడానికి ప్రతి ఏడాది ఒక కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం తనకు అలవాటని, అలానే ఈసారి ఉపవాసాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు అగర్వాల్.
ఈ మేరకు పోస్ట్‌లో ఇలా వివరించారు అగర్వాల్. "నా పుట్టినరోజు వేడుకలో కోసం 90 గంటలపాలు ఉపవాసం చేశాను. అంటే నాలుగు రోజుల పాటు ఆహారం తీసుకోలేదు. ఆ క్రమంలో నాకు మొదటిరోజు పెద్దగా ఎలాంటి సమస్యలు రాలేదు, కానీ ఆ తర్వాత రెండోరోజు జోమాటో గుర్తొచ్చింది. మూడవ రోజు నిశబ్దం. నాల్గవరోజు పుట్టిన రోజులు గతంలో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనే దానిపై క్లారిటీ వచ్చింది. "అని అగర్వాల్ రాసుకొచ్చారు పోస్ట్‌లో.

ఎందుకిలా అంటే..
ఈ పుట్టిన రోజుని ‘ఆకలి వర్సెస్ సంకల్ప బలం’ అనే సవాలుని తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. తన సంకల్పం గెలుస్తుందో ఆకలే ఓడిస్తుందో తెలుసుకోవాలని అనుకున్నారట. ఎందుకంటే ఇప్పుడు మనం క్షణాల్లో పనులు జరిగిపోయే ఇంటర్నెట్ యుగంలో ఉన్నాం. మనకు ఆహారం జస్ట్ పదినిమిషాల్లో మన ఇంటి గుమ్మం ముందు ఉంటుంది. ప్రతీదీ రెప్పపాటులో ముగిసిపోయేలా అయిపోవాలనుకునే కాలంలో ఉన్నాం. కాబట్టి మనకు ఓపిక, ఓర్చుకునే సామర్థం ఎంత వరకు ఉందో అంచనా వేసేందుకని చెబుతున్నారు అగర్వాల్.
ఈ 90 గంటల ఉపవాసం తర్వాత మనకు ఆకలిని తట్టుకునే సామర్థ్యం ఉందని తెలిసింది. అలాగే ఈ సవాలు వల్ల తానొక సూపర్ హీరో అనే భావన కలిగిందన్నారు. ఒక్కోసారి మన బ్రెయిన్ ఆలోచన తప్పు అనేలా మన శారీరక పరిమితులు ఉంటాయని, అవి ఇలాంటి సవాళ్లతోనే తెలుస్తుందని అప్పుడు ఏది అసాధ్యంగా అనిపించదంటూ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా పంచుకున్నారు. నెటిజన్లు దీన్ని సహనానికి సంబంధించిన అద్భుత కథ అని, ఇలాంటివి శారీరక పరిమితులను అధిగమించడం గురించి చాలానే నేర్పిస్తుందన్నారు.
ఇదీ చదవండి: డైట్ క్రమశిక్షణ అంటే ఇదే..వైరల్‌గా వంటల ప్లాన్!


