owl Butterfly గుడ్లగూబ కళ్ల సీతాకోక చిలుక | Do you know about Natural History of the owl Butterfly | Sakshi
Sakshi News home page

owl Butterfly గుడ్లగూబ కళ్ల సీతాకోక చిలుక

Nov 21 2026 2:25 PM | Updated on Nov 21 2026 3:00 PM

Do you know about Natural History of the owl Butterfly

Owl Butterfly  పిల్లలూ... భూమి విపరీతంగా వేడెక్కుతోంది. దీని విరుగుడుకు చర్యలు తీసుకోవాలి. అందుకే  ప్రపంచ దేశాల నాయకులంతా ఇప్పుడు టర్కీ దేశంలోని అంటాల్యా నగరంలో సమావేశమయ్యారు. దాని పేరు ‘కాప్‌–31’ (cop31) వాతావరణ సదస్సు. ఓవైపు పెద్దలంతా పర్యావరణం గురించి సీరియస్‌గా చర్చిస్తుంటే, అక్కడే ఒక అద్భుతమైన రంగుల ప్రపంచం అందరినీ కట్టిపడేస్తోంది! 

అంటాల్యా ఎక్స్‌పోసెంటర్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాపికల్‌ గార్డెన్‌లో  ఏకంగా 20 వేల సీతాకోక చిలుకలు రివ్వుమంటూ ఎగురుతున్నాయి! పది రకాల జాతులకు చెందిన ఈ సీతాకోకచిలుకల్లో ‘జెయింట్‌ అవుల్‌ బటర్‌ఫ్లై’ (గుడ్లగూబ కళ్ల సీతాకోకచిలుక) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచంలోనే అతిపెద్ద సీతాకోకచిలుకల్లో ఒకటైన దీని రెక్కల మీద అచ్చం గుడ్లగూబ కళ్ల లాంటి మచ్చలు ఉంటాయి! 

ఇదీ చదవండి: మణికట్టుపై వాచీ ఎప్పటి నుంచి? ఇంట్రస్టింగ్‌ స్టోరీ
 

 

శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ప్రకృతి దీనికి ఇచ్చిన రక్షణ కవచం ఇది. ఇలాంటి సీతాకోక చిలుకల్లాంటివి బతకాలంటే భూమిని చల్లబరచాల్సిందే.

 ఇదీ చదవండి: డెబ్యూతోనే ప్రశంసలు : ఒరాకిల్‌ నుంచి ‘తార’ గా ఎవరీ భామ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement