డైట్‌ క్రమశిక్షణ అంటే ఇదే..వైరల్‌గా వంటల ప్లాన్‌! | Bengaluru Women's Detailed Meal Plan Goes Viral | Sakshi
Sakshi News home page

డైట్‌ క్రమశిక్షణ అంటే ఇదే..వైరల్‌గా వంటల ప్లాన్‌!

Oct 6 2026 11:50 AM | Updated on Oct 6 2026 11:56 AM

Bengaluru Women's Detailed Meal Plan Goes Viral

ఎక్కడైనా ఒక ఫ్లాట్‌ ఓ ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులుంటే వారికి ఏ రోజు ఏ వండాలో ఫుడ్‌ మెనూ వివరిస్తాం. అంతేగానీ ఒక్కోక్కరికి ఒక్కోలా ఫుడ్‌ మెనూ ఇవ్వం. కానీ ఇక్కడ ఓ నలుగురు ఫ్లాట్‌మేట్స్‌ తమ డైటింగ్‌ అనుసారం ఇచ్చిన మెనూ..ప్రతిరోజు తమ వంటమనుషుల కోసం వాట్సాప్‌లో సెట్‌ చేసే మెనూ నెట్టింట వైరల్‌గా ఉంది. వాళ్ల  వంటల డైట్‌ మెనూ నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. అంత కచ్చితంగా డైట్‌ ప్లాన్‌ ఉండేలా రోజు సిద్ధం చేసుకోవడం అందుకు అనుగుణంగా వండిపెడుతున్న వంట మనుషుల నిబద్ధతకు ఫిదా అవుతున్నారు నెటిజన్లు. 

ఇది బెంగళూరు మహిళల ఫుడ్‌ ప్లాన్‌. బెంగళూరులోని ఒక ఫ్లాట్‌మేట్స్‌ వాట్సాప్‌ గ్రూప్‌ వారి రోజూ మెనూ అత్యంత వివవరమైన ఆర్డర్‌ స్క్రీన్‌షాట్‌తో వైరల్‌ అయ్యింది. ఆ నలుగురు ఫ్లాట్‌మేట్స్‌, వంటవాళ్ల వాట్సాప్‌ గ్రూప్‌లోని రోజువారి అసాధారణమైన ఫుడ్‌ ఫ్లాన్‌ అది. 

‘బడ్డీ నివాస్‌ కుకింగ్‌’ అనే గ్రూప్‌లో కాష్వి, ఊర్వశి, పరి, ఇషిక అనే ఫ్లాట్‌మేట్స్‌, ఇద్దరు వంటవాళ్లు సరిత, సునీత మధ్య జరిగే చిట్‌చాట్‌తో కూడిన ఫుడ్‌ప్లాన్‌. కాషీ సక్సేనా ఈ గ్రూప్‌ స్క్రీన్‌షాట్‌ని సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. ఆ మెసేజ్‌లో ప్రతి ఫ్లాట్‌మేట్‌కు అల్పాహారం, మధ్యాహ్న భోజనం,  రాత్రి భోజనానికి ఏమి కావాలో, వాటికి కావలసిన పదార్థాలు, పరామాణాల గురించి నిర్ధిష్ట సూచనలతో కూడిన లిస్ట్‌ ఉంది 

బ్రేక్‌ఫాస్ట్‌..
కాష్వి.: బ్రోకలి బ్రెడ్‌ లేకుండా, పుట్టగొడుగులు, ఉల్లిపాయలు, టమోటాతో కూడిన రెండు తెల్లగుడ్లసొన ఆమ్లెట్‌.

ఊర్వశి: ఉల్లిపాయ లేకుండా రెండు గుడ్ల ఆమ్లెట్‌, రెండు బ్రెడ్‌ ముక్కలు

ఇషిక: పుట్టగొడుగులు, ఉల్లిపాయ, టమోటాలతో చేసిన రెండు గుడ్ల ఆమ్లెట్‌, రెండు బ్రెక్‌ స్లైస్‌లు

పరి: స్కిప్‌ ఫుడ్‌

లంచ్‌:

కాష్వి: చికెన్‌, బ్రౌన్‌ రైస్‌, కూరగాయలు

ఊర్వశి: చికెన్‌ తోపాటు వైట్‌రైస్‌, కూరగాయలు

ఇషిక: రెండు అవకాడో, ఎగ్‌టోస్ట్‌

పరి: ఉల్లిపాయ, పుట్టగొడుగు, టమోటాలతో కూడిని మూడు గుడ్ల ఆమ్లెట్‌, చీజ్‌ శాండ్‌విచ్‌లు
డిన్నర్‌:

కాష్వి, ఊర్వశి: అన్నం లేకుండా దోసకాయ, సలాడ్‌ డ్రెస్సింగ్‌తో చికెన్‌ ముక్కలు

పరి: బెండకాయ, రైతా, రెండు రోటీలను

ఇలా అడిగినవి వండిపెట్టే వంటవాళ్లు ఉండటం వల్లే కూల్‌గా హాయిగా ఉండగలుగుతున్నామని చెప్పుకొచ్చింది కాష్వి. సునీత, సరితలు ఏం చెప్పిన..హైరానాగా ఫీల్‌కారని, మంచి పనిమంతులని ప్రశంసిస్తోంది. బెంగళూరులోని ఇందిరానగర్‌ ప్రాంతంలో వంటవారి కోసం వెతుకుతున్న వారికి ఈ వంటవాళ్ల పేర్లను సిఫార్సు చేస్తున్నట్లు చెప్పుకొచ్చిందామె. 

నెటిజన్లు కూడా ఈ పోస్ట్‌ని చూసి.. ప్రతిరోజు ఆ ఫ్లాట్‌మేట్స్‌ ఇంత వివరంగా ఎలా మెనూని తయారు చేసుకోగలుగుతున్నారంటూ ఆశ్యర్యపోతూ పోస్టులు పెట్టారు. కాగా, తమ భోజనాల గురించి ముందుగా వంటవాళ్లతో చర్చించాక మెనూ రెడీ అవుతుందని, అలాగే తాము వాళ్లకి అలవాటైపోవడతో ఒక్కోసారి తాము మెనూ చెప్పకపోయినా..ఏం తింటామో అంచనావేయగలరని అంటోంది క్వాషి.

ఇదీ చదవండి: ఒత్తిడి తెచ్చిన ముప్పుకి స్టార్టప్‌కి అమ్మేశాడు! కట్‌చేస్తే ఏకంగా రూ. 8వేల కోట్లు..

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement