ప్రముఖ కర్ణాటక గాయని ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ ప్రారంభోత్సవంలో టాలీవుడ్ నటి రష్మిక మందన్న అద్భుతమైన నీలిరంగు కంజీవరం పట్టుచీరలో తళుక్కుమన్నారు. ఈ కార్యక్రమంలోని రెడ్‌కార్పెట్‌పై సంప్రదాయ లుక్‌తో మెరిసింది నేషనల్ క్రష్. అచ్చం సుబ్బలక్ష్మీ వారసత్వాన్ని అందుకున్నట్లుగా ఆమె ఆహార్యం ఉంది. అంతేగాదు ఆమె ధరించిన చీరను కూడా శాస్త్రీయ సంగీతం ఆధారంగానే రూపొందించడం విశేషం. మరి ఆ చీరలో ఏఏ విశేషాలు దాగున్నాయో చూద్దామా..!.
ముద్దుగుమ్మ రష్మిక ఐక్యత వారి సుస్వర రాగ ఎడిషన్ నుంచి శంకరాభరణ కంజీవరం పట్టు చీరను ఎంచుకున్నారట. చేతితో నేసిన ఈ పట్టుచీర ముదురు నీలిరంగుతో ప్రారంభమై క్రమంగా రాజసం ఉట్టిపడే ఊదారంగులోకి మారుతుంది. సన్నని బంగారు జరీ, దేవాలయ స్ఫూర్తితో కూడిన నమునాల అంచు, పల్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాదు ఈ ఆరుగజాల నీలిరంగు చీరను మరింత అందంగా కనిపించేలా చేశాయి.
అలాగే శంకరాభరణంతో ఉన్న సంబంధాన్ని కూడా హైలెట్ చేసింది. శాస్త్రీయ రాగాల రంగు ఆకృతి నుమునాలను కూడా ఈ చీరలో పొందుపర్చడం విశేషం. అదీగాక ఎంఎస్సీ సుబ్బలక్ష్మీ ప్రదర్శనలన్నీ కంజీవరం పట్టు చీర, సాంప్రదాయ బంగారు ఆభరణాలతో ముడిపడి ఉన్నందున.. ఆ పాత్రలో నటిస్తున్న రష్మిక కూడా ఆ కార్యక్రమానికి అనుగణంగా ఈ శారీని ఎంచుకుంది. తన పాత్రకు అనుగుణంగానే బంగారు ఝమ్కాలు, సాంప్రదాయ గాజులు, సరిపోయే నాథ్ అనే జుట్టు ఆభరణం, మలెపూల గజ్రాతో అచ్చం సుబ్బలక్ష్మీ అనిపించేలా అద్భుతంగా కనిపించింది.
ఇదీ చదవండి: 90 గంటల పాటు ఏమి తినకుండా..సీఈవో మైండ్‌బ్లాక్ సవాల్!


