కష్టానికి తగిన ఫలితం తప్పక ఉంటుందని చెప్పే స్టోరీ. మన పెద్దలు తరుచుగా కష్టే ఫలి అని చెప్పేమాటకు నిలువెత్తు నిదర్శనం ఈ వృద్ధుడు. పాపం అతడికి కూడా తెలియదు అంత మొత్తం పెన్షన్ ఉందన్న విషయం. చివరికి తెలుసుకుని కలలో కూడా అనుకోలేదంటూ ఉబ్బితబ్బిబవుతున్నాడు.
అసలేం జరిగిందంటే..చైనాకు చెందిన 71 ఏళ్ల రు(Ru) అనే వృద్ధుడు హునాన్ ప్రావిన్స్‌లోని చాంగ్‌డేలో జీవనోపాధి కోసం 21 ఏళ్లుగా పాత సామాన్లు (స్క్రాప్) ఏరుకుంటూ జీవించాడు. సెప్టెంబర్ చివరలో తన పెన్షన్ ఖాతాతో అనుసంధానమైన బ్యాంక్ కార్డు అందింది. అందులో డబ్బు ఎంతో ఉందో బ్యాలెన్స్ చెక్‌చేయగా ఏకంగా రూ. 61 లక్షలు ఉన్నట్లు తెలుసుకుని విస్తుపోయాడు. తనకు పెన్షన్ పొందే అర్హత ఉందని తెలియదని అంటున్నాడు.
ఇంత మొత్తం వచ్చేలా చేసిన సామాజికి సంక్షేమ అధికారులు, ప్రభుత్వ విభాగాలకు కృతజ్ఞతలు తెలిపాడు. అస్సలు ఇంత మొత్తం కలలో కూడా ఊహించలేదని అంటున్నాడు. నిజానికి రు గతంలో హునాన్‌లోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే దుకాణంలో 30 ఏళ్ల పాటు పనిచేశాడు. 2000 ప్రారంభంలో ఉద్యోగులు పునరవ్యవస్థీకరణ సమయంలో తన ఉద్యోగం కోల్పోయాడు. అందుకుగానూ కొంత పరిహారం లభించింది. ఆ డబ్బు అయిపోయాక..ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. చివరికి జీవనోపాధి కోసం పాత సామాన్లు ఏకుంటూ జీవించడం ప్రారంభించాడు.
ఆ తర్వాత చాంగ్‌డేకు వెళ్లి..పాడుబడిన భవనంలో నివశించడంతో అతడి గురించి వెలుగులోకి వచ్చిది. సంక్షేమ శాక సిబ్బంది అతడిని గుర్తించి తాత్కాలికి వసతి గృహానికి వెళ్లమని కోరితే..మొదట్లో అందకు ఒప్పుకోలేదు. చివరికి ఆశ్రయానికి వెళ్లడానికి అంగీకరించి అధికారులకు తన నేపథ్యం వివవరించడంతోనే అతడి గురించి వెలుగులోకి వచ్చింది. 2015లో పదవీ విరమణ వయస్సు వచ్చినప్పటి నుండే 'రు' పెన్షన్ పొందడానికి అర్హుడని అధికారులు తెలిపారు. అ
తనికి పెన్షన్ నెలకు రూ. 50 వేలుగా అంచనా వేశారు. అధికారులు దశాబ్ద కాలం నుంచే చెల్లిస్తుండటంతో అంత పెద్ద మొత్తంగా మారింది. పెన్షన్‌కు అర్హత పొందాలంటే..విడిగా దీర్ఘకాలిక బీమా చెల్లింపులు చేయాలేమో అనుకున్నాడు రూ. కానీ తనకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇన్సూరెన్స్ తీసుకోవడం అతడి వల్ల సాధ్యం కాలేదు. అయితే అతడు ప్రభుత్వ ఆధ్వర్యంలోని దుకాణంలో పనిచేస్తున్నప్పుడూ తన జీతంలో కొంత భాగం భీమా కోసం కేటాయించడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.
చైనా నిబంధనల ప్రకారం, 15 ఏళ్లకు పైగా బీమా చెల్లింపులు చేసిన వారు పదవీ విరమణ వయస్సు వచ్చిన తర్వాత పెన్షన్‌కు అర్హత పొందవచ్చు. అలా రు అనే వృద్ధుడికి ఇన్ని లక్షలు అకౌంట్ చేరాయి. అయితే బ్యాంక్ కార్డుని తిరిగి ఇస్తూ సంక్షేమ అధికారులు డిజిటల్ మోసాల బారినపడకుండా కేర్‌ఫుల్‌గా ఉండాలని సూచించారు రుకి. రెండు దశాబ్దాలకు పైగా పారేసిన వస్తువులను సేకరించి జీవనం సాగించిన రుకి జీవితచరమాంకలో ఇంత మొత్తం నిజంగా ఊహంచని గొప్ప ఆర్థిక మలుపు కదూ ..!
ఇదీ చదవండి: తెలుగు మీడియం బ్యాగ్రౌండ్ నుంచి దుబాయ్ వరకు..!


