వైరలవుతోన్న స్మృతి ఇరానీ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌

Smriti Irani Shares Important Life Lessons About Karma - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్‌ మీడయాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. ఫన్నీ మీమ్స్‌, తన వర్క్‌కు సంబంధించిన కోట్స్‌ షేర్‌ చేస్తుంటారు. గత కొద్ది రోజులుగా జీవిత సత్యాలకు సంబంధించి ఆసక్తికరమైన కోట్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేస్తున్నారు స్మృతి ఇరానీ. తాజాగా కర్మకు సంబంధించి ఆమె షేర్‌ చేసిన ఓ కోట్‌ ప్రస్తుతం తెగ ట్రెండ్‌ అవుతోంది. కర్మ అద్దలాంటిది అంటున్నారు ఇరానీ. అద్దం ముందు నిల్చుని మనం ఏం చేస్తే... అదే కనిస్తుందని తెలిపారు. ‘ఇతరులకు నీవు చేసే కీడు నీకు ఎప్పుడు అర్థం అవుతుంది అంటే.. అదే నష్టం నీకు జరిగినప్పుడు.. అందుకే నేను ఇక్కడ ఉన్నాను-కర్మ’ అంటూ ఇరానీ షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఈ కోట్‌ను ప్రతి ఒక్కరు అంగీకరిస్తారు. అందుకనుగుణంగానే పోస్ట్‌ చేసిన కొద్ది గంటల్లోనే దీనికి 20 వేల లైక్‌లు వచ్చాయి. చాలా మంది నెటిజనులు ‘బాగా  చెప్పారు మేడం.. నిజం’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. (చదవండి: ‘ఒంటరిగా పోరాడితే.. బలవంతులవుతారు’)
 

Karma is not a ***** , it’s a mirror ... #duniyagolhai 🙏

A post shared by Smriti Irani (@smritiiraniofficial) on

కొద్ది రోజుల క్రితం స్మృతి ఇరానీ ఓ సందేశాత్మక కోట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘మీలోని భయాలు తొలగపోవడానికి కొంత సమయం పడుతుంది. గాయపడిన మీ హృదయం కోలుకోవడానికి కొంత సమయంల పడుతుంది. విధితో తలపడే బలాన్ని కనుగొనడానికి కొంత సమయం పడుతుంది. ఇవన్ని జరగడానికి సమయం పట్టవచ్చు.. కానీ కోరుకున్నది తప్పక జరిగి తీరుతుంది’ అంటూ పోస్ట్‌ చేశారు స్మృతి ఇరానీ. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top