కష్టాలపై ‘సుదర్శన’చక్రం 

Life Lesson Of An Eleven Year Old Boy - Sakshi

తండ్రి మరణంతో బాధ్యత భుజానికి 

తల్లికి చేదోడువాదోడుగా చిన్నారి 

ఇంటింటికీ తిరిగి కాయగూరల విక్రయం 

చదువుకుంటూనే చిరు వ్యాపారం 

బేల్దారి పనులతో మా అమ్మ ఎంతో కష్టపడుతోంది. కరోనా కారణంగా పనిలేకుండా పోయింది. కష్టాలు చుట్టుముట్టాయి. ఇల్లు గడవటం కష్టంగా మారింది. అందుకే అమ్మకు సాయంగా ఉంటున్నా.. ఇది నాకు ఏమాత్రం కష్టం కాదు. – ఓ పదకొండేళ్ల కుర్రాడు చెప్పిన జీవిత పాఠం 

ఆ చిన్నారికి నిండా పదకొండేళ్లు లేవు. తన వయస్సు పిల్లలంతా టీవీ చూడ్డమో.. సెల్‌ఫోన్‌లో గేమ్స్‌ ఆడుకోవడమో చేస్తుంటారు. కానీ  ఆ బడతడు ఆటలకు దూరమయ్యాడు. తండ్రి దూరమై తల్లడిల్లుతున్న తల్లికి తోడయ్యాడు. కరోనా కష్టకాలంలో కుటుంబ బాధ్యతను నెత్తికెత్తుకున్నాడు. ఇళ్లిళ్లూ తిరుగుతూ కూరగాయలు విక్రయిస్తున్నాడు. తల్లి, ఇద్దరు అక్కలకు ఆర్థిక ఆసరానిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. వయస్సులో చిన్నోడయినా బాధ్యత నెత్తికెత్తుకోవడంలో అందరికన్నా మిన్న. అందుకే అందరూ శభాష్‌ సుదర్శనా అంటున్నారు. ఎవరీ చిన్నారి..ఏమా కష్టం..తెలుసుకుందాం.. స్ఫూర్తి పొందుదాం.

గుత్తి: గుత్తి పట్టణంలోని గాంధీ నగర్‌ కాలనీలో వెంకటేష్, సుజాత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి యశోద, వెంకట లక్ష్మి, రమణి, పద్మావతి, సుదర్శన్‌ అనే ఐదుగురు సంతానం. ఈ దంపతులు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. విధి వక్రించడంతో ఆరేళ్ల క్రితం వెంకటేష్‌ మరణించాడు. దీంతో సుజాత కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించింది. ముగ్గురు కుమార్తెలకు వివాహాలు కూడా చేసింది. ఈ క్రమంలో కుటుంబం గడవడం కష్టంగా మారగా... పదకొండేళ్ల కుమారుడు సుదర్శన్‌ తల్లికి తోడుగా నిలిచాడు. మూడు సంవత్సరాలుగా తల్లితో పాటు శ్రమిస్తున్నాడు. తల్లి తయారు చేసిన దోశలు, ఇడ్లీలు, వడలు బకెట్లో పెట్టుకుని ఊరంతా తిరుగుతూ విక్రయిస్తూ వచ్చిన కొద్దిపాటి మొత్తంతో కుటుంబానికి ఆర్థిక చేయూతనిస్తున్నాడు. మరోపక్క చదువు కూడా కొనసాగించాడు. అంతా బాగుందనుకుంటున్న తరుణంలో ఆ కుటుంబానికి కొత్త కష్టం వచ్చి పడింది.

సుదర్శన్‌ వద్ద ఆకుకూరలు కొంటున్న మహిళలు..   

కరోనా కష్టాలతో జీవితం తలకిందులు.. 
కరోనా కారణంగా ఐదు మాసాలుగా లాక్‌డౌన్‌ విధించగా...వీరి జీవితం తలకిందులైంది. దోశలు, వడలు, ఇడ్లీలు విక్రయించడం కష్టమైంది. ఆర్థిక పరిస్థితి దిగజారగా ఇళ్లు గడవడం ఇబ్బందిగా మారింది. దీంతో సుదర్శన్‌ నిత్యావసరాలైన కూరగాయలు, ఆకుకూరలు విక్రయించాలనే నిర్ణయానికి వచ్చాడు. ఓ సైకిల్లో ఆకుకూరలు, కూరగాయల  బుట్ట పెట్టుకుని ఊరంతా తిరుగుతూ  విక్రయిస్తున్నాడు. రోజూ రూ.150 నుంచి రూ.200 దాకా సంపాదిస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్నాడు. ఇప్పటి వరకూ బాగానే ఉన్నా...రేపు పాఠశాలలు తిరిగి తెరిస్తే సుదర్శన్‌ జీవితం ప్రశ్నార్థంగా మారనుంది. కుటుంబ బాధ్యతా..? భవిష్యత్‌ వైపు అడుగులా తేల్చుకోలేని కష్టం ఎదురుకానుంది. మనసున్న మనుషులు కాస్త చేయూతనిస్తే ఇంటిపెద్దగా మారిన ఈ చిన్నారి జీవితం ఒడ్డునపడుతుంది.  

నాన్న చనిపోవడం బాధించింది.. 
మేము ఐదుగురు సంతానం. అనారోగ్యంతో నాన్న చనిపోవడం నన్ను ఎంతగానో బాధించింది. అప్పుడు నా వయస్సు ఐదేళ్లు. ఏడవద్దని అమ్మను మేమంతా ఓదార్చాం. అమ్మ ఎంతో కష్టపడి ముగ్గురు అక్కలకు పెళ్లిళ్లు చేసింది. మూడు సంవత్సరాల క్రితం నుంచి అమ్మకు తోడుగా నేనూ చిరు వ్యాపారం చేస్తున్నా. అమ్మచేసే ఇడ్లీలు, వడలు, దోశలు ఊరంతా తిరిగి అమ్ముతున్నా. కరోనా వల్ల  వ్యాపారం లేక... బుట్టలో కూరగాయలు, ఆకుకూరలు పెట్టుకొని విక్రయిస్తున్నా. నేను బరువు మోయలేనని అమ్మ ఈ మధ్యనే చిన్న సైకిల్‌ కొనిచ్చింది. నేను చిన్న పిల్లోడిని కావడంతో అందరూ నా వద్దే కొంటున్నారు. ప్రస్తుతం నేను కోట ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నా. బడి తెరిచినా..కూరగాయలు విక్రయించడం కష్టమవుతుందేమో...అయినా అమ్మ కోసం అన్నీ ఇష్టంగానే చేస్తా. 

సాయం చేయాలనుకుంటే..
సుజాత, సుదర్శన్‌ 
జాయింట్‌ అకౌంట్‌ 
అకౌంట్‌ నెం.31262250092754 
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ : SYNB0003126 
సిండికేట్‌ బ్యాంకు, గుత్తి అర్బన్‌   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

20-01-2021
Jan 20, 2021, 08:43 IST
న్యూఢిల్లీ: వ్యాక్సిన్‌ తీసుకోవడంపై సమాజంలో అపోహలు ఉన్నాయని నీతిఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ చెప్పారు. మంగళవారం ఆయన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో...
19-01-2021
Jan 19, 2021, 12:57 IST
సాక్షి, ముంబై: ఒకవైపు కరోనా  మహమ్మారి అంతానికి దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు  సీరం వ్యాక్సిన్‌ తీసుకున్న 24...
19-01-2021
Jan 19, 2021, 08:45 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా టీకాల కార్యక్రమం ఎప్పుడు మొదలవుతుందో తెలియట్లేదు. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణీత...
19-01-2021
Jan 19, 2021, 08:06 IST
బెంగళూరు : వ్యాక్సిన్‌ తీసుకున్న అనంతరం రెండు మరణాలు సంభవించడం దేశంలో కలకలం రేపుతోంది. ఒకరు ఉత్తరప్రదేశ్‌లోనూ, మరొకరు కర్ణాటకలోనూ...
19-01-2021
Jan 19, 2021, 03:16 IST
సాక్షి, అమరావతి/ భీమడోలు: హెల్త్‌కేర్‌ వర్కర్లకు నిరంతరాయంగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియలో భాగంగా మూడో రోజు రాష్ట్రంలో 14,606...
18-01-2021
Jan 18, 2021, 20:35 IST
సాక్షి,  హైదరాబాద్ : కరోనా వ్యాక్సినేషన్‌ తీసుకున్న వారిలో కొంతమంది అస్వస్థతకు గురవుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో వాక్సిన్‌ తీసుకున్న ఏడుగురు ఒళ్లు నొప్పులు,...
18-01-2021
Jan 18, 2021, 15:28 IST
సాక్షి, ముంబై : దేశ వ్యాప్తంగా శనివారం నుంచి కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. శనివారం మొదటి ఫేజ్‌...
18-01-2021
Jan 18, 2021, 10:54 IST
సాక్షి, లక్నో : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి నివారణకుగాను ఫ్రంట్‌లైన్‌ వర్కర్‌లకు వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన తరుణంలో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో విషాదం చోటు...
18-01-2021
Jan 18, 2021, 05:52 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్ర జనాభాలో ఏకంగా 20 శాతానికి పైగా...
18-01-2021
Jan 18, 2021, 03:55 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ ప్రక్రియ రెండో రోజూ చురుగ్గా కొనసాగింది. ఉదయం 9 గంటలకే వ్యాక్సిన్‌ ప్రక్రియ...
17-01-2021
Jan 17, 2021, 15:07 IST
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సజావుగా కొనసాగుతున్న వేళ, దేశ రాజధాని ఢిల్లీలో వ్యాక్సిన్‌...
17-01-2021
Jan 17, 2021, 13:28 IST
‘మా అన్నయ్య చనిపోయాడు. ఇంక నాకీ లోకంలో ఎవరూ లేరు’ అని  ఓ అమ్మాయి ఏడుస్తుంటే..  ‘అయ్యో.. అలా అనకు.. నీకు నేనున్నా’...
17-01-2021
Jan 17, 2021, 10:13 IST
సాక్షి, హైదరాబాద్‌ : కరోనాపై అవగాహన కోసం కేంద్రం ఆదేశాల మేరకు ప్రతి టెలికాం సంస్థ విధిగా వినిపిస్తోన్న కాలర్...
17-01-2021
Jan 17, 2021, 05:49 IST
బీజింగ్‌: బీజింగ్‌ దక్షిణ ప్రాంతంలో కరోనా కేసులు తిరిగి నమోదవుతున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం కేవలం 5 రోజుల్లోనే 1,500...
17-01-2021
Jan 17, 2021, 05:43 IST
న్యూఢిల్లీ/హైదరాబాద్‌: ఆక్స్‌ఫర్డ్‌–ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌ టీకా మాత్రమే తమకు ఇవ్వాలని ఢిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా(ఆర్‌ఎంఎల్‌) ఆసుపత్రి రెసిడెంట్‌...
17-01-2021
Jan 17, 2021, 05:34 IST
బీజింగ్‌: కరోనా వైరస్‌ జాడలున్న 4,800 ఐస్‌క్రీం బాక్సులను చైనా అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమై ఈ వైరస్‌ ఎక్కడి...
17-01-2021
Jan 17, 2021, 05:22 IST
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్దదయిన కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం భారత్‌లో శనివారం ప్రారంభమైంది. తొలి దశలో దేశవ్యాప్తంగా వేలాది మంది...
17-01-2021
Jan 17, 2021, 05:04 IST
ఓస్లో: కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నార్వేలో తీవ్ర విషాదం మిగిల్చింది. ఇటీవల ఫైజర్‌వ్యాక్సిన్‌ తీసుకున్న 23 మంది వృద్ధులు మృతి...
17-01-2021
Jan 17, 2021, 04:56 IST
భారత్‌లో ఉత్పత్తి చేసిన టీకాలతో కరోనా మహమ్మారిపై నిర్ణయాత్మక విజయం సాధించడం తథ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం...
17-01-2021
Jan 17, 2021, 03:23 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలి రోజు కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ విజయవంతమైంది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top