
చాట్‌జీపీటీ నేర్పిన పాఠం,గొప్ప జీవిత సత్యం
టెక్‌ప్రపంచంలో చాట్ జీపీటీ ఒక విప్లవం. విద్యార్థులనుంచి మేధావుల దాకా ఏఐ ఒక షార్ట్‌కట్‌గా మారిపోయింది. తాజాగా బరువు తగ్గే విషయంలో కూడా ఇదొక గేమ్ చేంజర్‌లా మారుతోంది. తాజాగా ఒక యూట్యూబర్ AI సహాయంతో అధిక బరువును విజయవంతంగా తగ్గించుకోవడంతోపాటు, ఆరోగ్యాన్ని ఎలా పొందాడో, జీవితంలో గొప్ప పాఠాన్ని ఏలా నేర్చుకున్నాడో షేర్ చేశాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది.
ChatGPT ప్రోగ్రామ్ ద్వారా ‘మై లైఫ్ బై AI’ అంటూ తన ఆరు నెలల సుదీర్ఘ ప్రయాణాన్ని వెల్లడించాడు. చాట్‌జీపీటీ లాంటి ఏఐ ద్వారా రూపొందించిన డిజిటల్ అసిస్టెంట్, ఫిట్‌నెస్ కోచ్ లేదా వర్చువల్ కోచ్‌కి ‘ఆర్థర్’ అని పేరు కూడా పెట్టుకున్నాడు. ఆర్థర్ సహాయంతో తన రొటీన్ డైట్ ప్లాన్ చేసుకునేవాడు. భోజనం, వర్కౌట్స్ ఇలా ప్రతీ అంశాన్ని నియంత్రించే సమగ్ర ఫ్రేమ్‌వర్క్ క్రియేట్ చేసుకున్నాడు. అదే అతని వెయిట్‌లాస్ జర్నీకి నాంది పలికింది. కేవలం ఆరు నెలల్లోనే కీలక పురోగతిని సాధించాడు.
చాట్ జీపీటీ ఇచ్చిన సలహాలతో ఆరు నెలల్లో సుమారు 27 కిలోలు తగ్గాడు. అంతేకాదు తన మెంటల్ హెల్త్, ఎనర్జీ స్థాయిల్లో కూడా మార్పును గమనించాడు. ఇది తన ఫిట్‌నెస్ ప్రయాణాన్ని మెరుగుపరచడమే కాకుండా, కంటెంట్ సృష్టిపై అభిరుచి మరింత పెంచిందనీ చెప్పాడు. దీంతో ఇప్పుడు పూర్తి సమయం యూట్యూబర్‌గా మారిపోవాలని ఆలోచిస్తున్నాడు.
అయితే ఈ జర్నీ అంత సజావుగా లేదు. ఆరంభంలో చాలా కష్టపడ్డాడు. వీకెండ్ మజాగా భావించే ఫాస్ట్ ఫుడ్ - బర్గర్లు, ఫ్రైస్, బీర్ లాంటి అనారోగ్య కరమైన అలవాట్లను మానుకునేందుకు ఇబ్బంది పడ్డాడు. నెమ్మదిగా వాటినుంచి బయటపడ్డాడు. ప్రతిరోజూ కిలోమీటర్లు, కిలోమీటర్లు నడవడం, బరువులు ఎత్తడం లాంటి కఠిన వ్యాయామాలపై దృష్టిపెట్టాడు.
AI-ఆధారిత భోజన ప్లాన్‌తో క్లీనర్ ఛాయిసెస్, స్మార్టర్ మీల్స్ అంటే శుభ్రమైన, పోషకాహారంపై దృష్టిపెట్టాడు. ప్రాసెస్ చేసిన స్నాక్స్, చక్కెర పానీయాలను పూర్తిగా మానేశాడు. తినే ఆహారంలో పోషకాలు మాత్రమే ఉండేలా చూసుకున్నాడు. అల్పాహారంలో గుడ్లు, పర్మేసన్ చీజ్, టోస్ట్‌లు చేర్చుకున్నాడు. భోజనంలోచిల్లీ బీఫ్, బియ్యం ,రిఫ్రైడ్ బీన్స్ తీసుకునేవాడు. డిన్నర్‌లో కాల్చిన చికెన్ఒక రకమైన చిలగడదుంప, కాల్చిన ఎర్ర క్యాప్సికమ్, కోర్జెట్‌లు , గ్రీకు యోగర్ట్ ఇదే డిన్నర్.
ఏఐ తన జీవితంలో లైఫ్‌స్టైల్ రీబూట్‌గా మారిందని, స్థిరంగా, పట్టుదలగా ఉండటంలోని పవర్ గురించి ఆర్థర్ తెలియచెప్పిందనీ మొత్తంగా , ఏఐ తన జీవితాన్ని పెర్‌ఫెక్ట్‌గా మార్చడమే కాదు ఎదురు దెబ్బలను ఎదుర్కోవడం ఎలాగో నేర్పించింది. నాలైఫ్ మొత్తాన్ని మార్చేసిందని చెప్పుకొచ్చాడు సంతోషంగా.