సన్నిధి
తాత్త్వికం
ఆది శంకరా చార్యుల వారు తన ఆర్తత్రాణపరాయణ నారాయణ స్తోత్రంలో.. దేవుడు ఎల్లప్పుడూ ఆర్తులను రక్షించి అనుగ్రహిస్తూ ఆనందిస్తూ ఉంటాడని దేవుణ్ణి కీర్తించాడు.
ఆర్తులు అంటే కష్టాల్లో, అవసరాల్లో ఉండి సహాయం కోసం ఎదురు చూసే జీవరాశులే!
అటువంటి..ప్రభుత్వ లేదా ప్రైవేటు లేదా స్వచ్ఛంద సేవలు అందించే సంస్థలలో విధులలో ఉన్న వారు ఎవరైనా సమయాభావం వలన సంప్రదాయ బద్దమైన దేవుని సేవలు చేయలేకపోయినా.. మనస్పూర్తిగా విధులు నిర్వహిస్తే అది దైవ కార్యమే అయినందున దేవుడు సంతృప్తుడై ఆ విధమైన ఉద్యోగులపై ప్రసన్నుడవుతాడు.
దీనుల కోసమే ప్రభుత్వ ఉచిత సేవలు, దాతల స్వచ్ఛంద సేవలు, కొందరు ఉదార స్వభావులచేత అతి తక్కువ ఖర్చుతో సేవలు ఏర్పాటు చేయబడి ఉంటాయి. అటువంటి రంగాలలో పనిచేయు వారు.. అవినీతికి పాల్పడకుండా సమయం ప్రకారం విధులు నిర్వహిస్తే అది దైవకార్యం నిర్వహించినట్లే అవుతుంది.
– డా. గాదిరాజు మధుసూదన రాజు
ఇదీ చదవండి: 'నోరు మంచిదైతే.. ఊరు మంచిది'


