తెలుగులోకి మలయాళ హిట్‌ సినిమా.. ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ | Jayanth And The Jingo Pen Movie First Look Released | Sakshi
Sakshi News home page

తెలుగులోకి మలయాళ హిట్‌ సినిమా.. ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

Sep 6 2026 5:55 PM | Updated on Sep 6 2026 6:05 PM

Jayanth And The Jingo Pen Movie First Look Released

టీచర్స్‌ డే సందర్భంగా ‘జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. జాతీయ అవార్డు గ్రహీత, ఉపాధ్యాయురాలు మారం పవిత్ర చేతుల మీదుగా ఈ పోస్టర్‌ను లాంచ్‌ చేశారు. నమో జయం ప్రొడక్షన్స్‌ పతాకంపై దివ్య ప్రవీణ్‌ బొలిశెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు విజేత నవీన్‌ దేశబోయిన దర్శకత్వం వహిస్తున్నారు. 

జయంత్‌ కీలక పాత్రలో నటిస్తుండగా.. తనికెళ్ల భరణి తాతగా, సత్యం రాజేష్‌ స్కూల్‌ టీచర్‌గా కనిపించనున్నారు. మలయాళ హిట్‌ ‘ఫిలిప్‌ అండ్‌ ది మంకీ పెన్‌’కు ఇది రీమేక్‌. పాఠశాల సమస్యలు, విద్యావ్యవస్థతో పాటు కుటుంబ భావోద్వేగాలను ఈ చిత్రంలో చూపించనున్నట్లు మేకర్స్‌ తెలిపారు.

ఈ సందర్భంగా జయంత్‌ మాట్లాడుతూ– ‘ ఇదో కొత్త తరహ చిత్రం. మనం రోజు స్కూల్లో ఎదుర్కొనే సమస్యలతో పాటు విద్యావ్యవస్థ గురించి మా సినిమాలో చెప్పటం జరిగింది’’ అన్నారు. 

దర్శకుడు నవీన్‌ దేశబోయిన మాట్లాడుతూ– ‘నేను ఈ సినిమా చేసినందుకు ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను. నా గత చిత్రం ‘లతా భగవాన్‌ ఖరే’, చిత్రానికి దేశవ్యాప్తంగా 32 అవార్డులు వచ్చాయి. వాటితో పాటు ఫిలింఫేర్,  నేషనల్‌ అవార్డును కూడా సొంతం చేసుకున్నాను. జయంత్‌ను హీరోగా పెట్టి నేను చేసిన ‘జయంత్‌ అండ్‌ జింగోపెన్‌’ మలయాళ సినిమా ‘ఫిలిప్‌ అండ్‌ ది మంకీ పెన్‌’ అనే చిత్రం రీమేక్‌. మలయాళంలో ఈ చిత్రం 111 రోజలు ప్రదర్శించి  ఘన విజయం సాధించింది. ఎన్నో ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఉండటంతో అంత పెద్ద విజయం సాధించింది.  తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తుందని నమ్ముతున్నా’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement