ఓటీటీలోకి క్రైమ్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే? | Panchanama Official Telugu Trailer Out In Telugu Zee5 Original | Sakshi
Sakshi News home page

OTT: ఓటీటీలోకి క్రైమ్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Sep 6 2026 5:32 PM | Updated on Sep 6 2026 5:41 PM

Panchanama Official Telugu Trailer Out In Telugu Zee5 Original

ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ఓ క్రైమ్‌ ‍థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ సిద్ధమైంది. మోహన్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తమిళ నటుడు భరత్‌ కీలక పాత్రలో నటించిన తెలుగు సిరీస్‌ ‘పంచనామా’ ఉదయ భాను ప్రొడక్షన్స్‌ పతాకంపై విజయేంద్ర మౌళి, ఉదయభాను నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు. ఈ రోజు( ఆదివారం) ట్రైలర్‌ విడుదలైంది.

సెప్టెంబర్‌ 11 నుంచి ప్రముఖ ఓటీటీ అయిన జీ5లో స్రీమింగ్‌ కానుంది. ఇదో క్రైమ్‌ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందించినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ఇందులో భరత్‌ పోలీస్‌ అధికారిగా కనిపించారు. ప్రవీణ్‌, ఆది, జోసఫ్‌ అనే ముగ్గురు ఎందుకు చెనిపోయారు.? కొద్ది రోజుల తరువాత దొరికిన చేతులు ఎవరివి? దొరికేలా ఎవరు చేశారు.? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే. ఇందులో శివాజీ రాజా, మేథారెడ్డి, రూప లక్ష్మి, శ్రీజ తదితరులు నటిస్తున్నారు.  ఇదీ చదవండి: బిగ్‌బాస్‌పై అంచనాలు పెంచేస్తోన్న ప్రోమో

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement