కృష్ణాష్టమి రోజున శుభవార్త.. బిగ్‌బాస్ జంటకు మరో కూతురు | Bigg Boss Telugu Rohit Sahni And Marina Blessed With Daughter | Sakshi
Sakshi News home page

Rohit Sahni-Marina: గుడ్ న్యూస్ చెప్పిన తెలుగు సీరియల్ జంట

Sep 5 2026 10:44 AM | Updated on Sep 5 2026 10:49 AM

Bigg Boss Telugu Rohit Sahni And Marina Blessed With Daughter

బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈసారి షోలో ఎవరెవరు పాల్గొంటారా అనేది చూడాలి. ప్రస్తుతానికైతే పెద్దగా బజ్ కనిపించట్లేదు. సరే ఈ సంగతి అలా వదిలేస్తే గతంలో ఇదే బిగ్‌బాస్‌లో రియల్ లైఫ్ జోడీ ఇప్పుడు మరోసారి తల్లిదండ్రులయ్యారు. తమకు కృష్ణాష్టమి రోజున మరోసారి కూతురు పుట్టిందనే శుభవార్తని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

(ఇదీ చదవండి: నడుము గిల్లే సీన్ చేయనంది.. 'బేబి' చూసి షాకయ్యా)

'అమెరికా అమ్మాయి' సీరియల్‌తో తెలుగు టీవీ ప్రేక్షకులకు పరిచయమైన మెరీనా.. తర్వాత కాలంలో మరో సీరియల్ నటుడు రోహిత్ సాహ్నిని ప్రేమించింది. అలా పెద్దల్ని ఒప్పించి వీళ్లిద్దరూ 2017లో పెళ్లి చేసుకున్నాడు. రోహిత్ కూడా పలు సినిమాలు, సీరియల్స్ చేశాడు. ప్రస్తుతం 'అమ్మోరు' అనే సీరియల్‌లో హీరోగా నటిస్తున్నాడు. ఇకపోతే 2022లో వీళ్లిద్దరూ జంటగా బిగ్‌బాస్ షోలో పాల్గొన్నారు.

మెరీనా కొన్ని వారాలు ఉండి ఎలిమినేట్ కాగా రోహిత్ మాత్రం టాప్-5 వరకు వెళ్లాడు. ఇకపోతే 2024 నవంబరులో వీళ్లకు తొలుత ఓ అమ్మాయి పుట్టింది. ఆమెకు తయిరా అని పేరు పెట్టుకున్నారు. గతేడాది జన్మాష్టమి సందర్భంగా పాపని అందరికీ పరిచయం చేశారు. ఇప్పుడు ఏడాది తిరిగేసరికల్లా మరోసారి తమకు కూతురు పుట్టిందనే సంగతిని రోహిత్-మెరీనా బయటపెట్టారు. దీంతో తోటి నటీనటులు, నెటిజన్లు వీళ్లకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

(ఇదీ చదవండి: 9 ఏళ్ల వయసులో 'భరతనాట్యం'.. శ్రీలీల చిన్నప్పటి వీడియో వైరల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement