విజయవంతంగా 10వ సీజన్‌లోకి అడుగుపెడుతున్న బిగ్ బాస్ తమిళం కొత్త ఇంటింతో సిద్ధమైంది. గడిచిన పదేళ్ల జ్ఞాపకాలు, భావోద్వేగాలకు అద్దం పట్టేలా ఈ సీజన్ హౌస్‌ను సరికొత్తగా తీర్చిదిద్దారు. 10 సంఖ్య ప్రతిబింబించేలా ఆర్కిటెక్చర్, విండోస్, జామెట్రిక్ డిజైన్లతో ఇంటి ముఖద్వారాన్ని ఆకర్షణీయంగా మలిచారు. ఈ రియాలిటీ షో చరిత్రలో ప్రపథమంగా మీడియా టూర్ పేరిట హౌస్‌లోకి ప్రతినిధులను తీసుకెళ్లారు.
సామాన్యుడే ప్రధాన థీమ్
నేలతల్లి మూలాలను చాటేలా ఎర్తీగ్రీన్, రస్టిక్ బ్రౌన్ రంగులతో ప్రకృతి సిద్ధమైన లుక్ ఇచ్చారు. హౌస్ మధ్యలో నేల నుంచి ఉద్భవించే కామన్ మ్యాన్ శిల్పం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సంప్రదాయ భారతీయ కోర్ట్‌యార్ట్ శైలిలో డైనింగ్ ఏరియాను రూపొందించారు. డీప్ గ్రీన్స్, టీల్స్, సుడెన్ టెక్స్చర్లతో కర్వ్‌డ్ ఐలాండ్ మోడల్‌లో కిచెన్ స్పేస్‌ను తీర్చిదిద్దారు. ఈ సీజన్ నుంచి మొదటిసారిగా సింగపూర్, కెనడా, యూకేలోని ప్రేక్షకులు కూడా తమ అభిమాన పోటీదారులకు లైవ్ ఓటింగ్ వేసే వెసులుబాటు కల్పించారు. బిగ్ బాస్ తమిళ సీజన్ 10 గ్రాండ్ ప్రీమియర్ ఆదివారం సాయంత్రం 6 గంటలకు విజయ్ టీవీ , జియోహాట్‌స్టార్‌లో ప్రసారం కానున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.
సాక్షి, చెన్నై:
చదవండి: వైష్ణవి గురించి 'ఇరుముడి' డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్


