ఓటీటీలో సూపర్ హిట్ సిరీస్ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే? | Super Hit Web Series Streaming On this Ott Platform from Today | Sakshi
Sakshi News home page

Heart Beat Series: ఓటీటీలో సూపర్ హిట్ సిరీస్.. ఎక్కడ చూడాలంటే?

Jul 30 2026 2:35 AM | Updated on Jul 30 2026 2:35 AM

Super Hit Web Series Streaming On this Ott Platform from Today

ఓటీటీలు వచ్చాక కంటెంట్‌కు కొదువ లేకుండా పోయింది. ప్రతివారంలో సరికొత్త వెబ్ సిరీస్‌లు, సినిమాల ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. సూపర్ హిట్ అయిన సిరీస్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీజన్ల మీద సీజన్స్ అలా స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. తాజాగా మరో సూపర్ హిట్ కామెడీ సిరీస్‌ హార్ట్‌ బీట్ సీజన్-3 స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

గతంలో రిలీజైన రెండు సీజన్స్ సక్సెస్‌ఫుల్ కావడంతో మేకర్స్ మరో సిరీస్ తెరకెక్కించారు. ఈ హార్ట్‌ బీట్ వెబ్ సిరీస్‌ ఈ రోజు నుంచే ఓటీటీలో సందడి చేస్తోంది. జియో హాట్‌స్టార్ వేదికగా అందుబాటులోకి వచ్చేసింది. ఈ సూపర్ హిట్ సిరీస్ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. 

ఓ ఆస్పత్రి నేపథ్యంలో సాగే ఈ వెబ్‌ సిరీస్‌లో కుటుంబ అంశాలు, ప్రేమ, ఒక తల్లి ప్రేమ కోసం యువతి పడే ఆరాటం కథాంశంగా తెరకెక్కించారు. గతంలో రిలీజైన ఈ హార్ట్‌బీట్‌ సిరీస్‌కు ఓటీటీ ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అలా ఇప్పటికే రెండు సీజన్స్ ఆడియన్స్‌ ఆదరణ దక్కించుకున్నాయి. ఈ సిరీస్‌కు దీపక్‌ సుందర రాజన్‌ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌లో దీపా బాలు, అనుమోన్, యోగలక్ష్మీ, శర్వ, శబరీశ్, చారుకేశ్, రామ్, చంద్రశేఖర్, గిరి ద్వారకేశ్, రేయ ముఖ్య పాత్రలు పోషించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement