నా అందానికి సీక్రెట్ అదే: హీరోయిన్ శ్రియ | Shriya Saran Reacts Her Glamour Secret Latest | Sakshi
Sakshi News home page

Shriya Saran: దాపరికాలేమీ ఉండవు.. ఏదీ దాచుకోను

Sep 13 2026 8:35 AM | Updated on Sep 13 2026 8:38 AM

Shriya Saran Reacts Her Glamour Secret Latest

నటి, ఒకప్పటి హీరోయిన్ శ్రియని చూస్తుంటే అందానికి వయసుతో పని ఉండదా? అనే సందేహం కలుగుతుంది. ఎప్పుడో పాతికేళ్ల క్రితం అంటే 2001లో 'ఇష్టం' అనే తెలుగు మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత సంతోషం, నేనున్నాను తదితర చిత్రాలతో అలరించింది. 2003లో తమిళంలోకి వెళ్లింది. విజయ్‌, ధనుష్‌, రజనీకాంత్‌ లాంటి స్టార్‌ హీరోల సరసన నటించి క్రేజ్‌ తెచ్చుకుంది. ఇక 2018లో ఆండ్రీ కొచ్చీవ్‌ అనే విదేశీయుడిని పెళ్లి చేసుకుంది. తర్వాత నటనకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఈమె.. అడపాదడపా చిన్న చిన్న పాత్రలు చేస్తోంది.

(ఇదీ చదవండి: పాక్ సినిమాలో 'సలార్' ఫైట్ కాపీ? వీడియో వైరల్)

44 ఏళ్ల వయసులోనూ అందంగా కనిపిస్తూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రియ.. తన సౌందర్య రహస్యం గురించి చెప్పింది. నేను మనసులో ఏదీ దాసుకోను. ఏది అనిపిస్తే అది చెబుతాను . ఏ విషయంలోనూ దాపరికాలు లేకుండా మాట్లాడటమే నా బ్యూటీకి కారణమని భావిస్తున్నా. ప్రకృతి, భగవంతుడు ప్రసాదించిన అందాన్ని నేను కాపాడుకుంటున్నానని చెప్పుకొచ్చింది. 

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో తొలి వీకెండ్‌.. ఒక్కరోజులో ఇన్ని ట్విస్టులా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement