ఇరుముడి చిత్రబృందానికి ’మెగా‘ అభినందనలు | Chiranjeevi, Ram Charan Met Irumudi Team And Congratulated Them On Success | Sakshi
Sakshi News home page

Irumudi Movie: ఇరుముడి చిత్రబృందానికి ’మెగా‘ అభినందనలు

Sep 13 2026 6:14 PM | Updated on Sep 13 2026 6:35 PM

Chiranjeevi, Ram Charan Met Irumudi Team And Congratulated Them On Success

రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’. గత నెల మూడో వారంలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా రూ.230 కోట్ల వరకూ గ్రాస్ వసూలు చేసింది. చిన్నాపెద్దా అని తేడాలేకుండా పెద్ద ఎత్తున థియేటర్లకు వెళ్లి సినిమా చూశారు. ఈ సినిమాని చూసిన పలువురు ఇప్పటికే ప్రశంసలు కురింపించారు. 

ఆ తరహాలోనే 'ఇరుముడి' విడుదలైన సమయంలో సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందాన్ని చిరంజీవి, రామ్‌చరణ్‌లు అభినందించారు. తాజాగా ‘ఇరుముడి’ టీమ్‌ని స్వయంగా కలిసి మరో సారి శుభాకాంక్షలు తెలిపారు. రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ, మైత్రీ నిర్మాతలు నవీన్ , వై. రవి శంకర్ లతో ఈ సమావేశంలో ఉన్నారు. ఇప్పుడీ వీడియో వైరల్‌ అడుతోంది.  
ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన

 A special moment of celebration ❤️‍🔥

Megastar @KChiruTweets Garu & Mega Power Star @AlwaysRamCharan Garu met Mass Maharaja @RaviTeja_offl Garu and the team of #Irumudi to celebrate the film’s massive success ✨❤️

Book Your Tickets Now! 
🎟️https://t.co/LPeVCIRYVl#IRUMUDI /… pic.twitter.com/qncXARM9eY

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement