‘‘హనుమంతుడు ఉన్న ప్రతి సినిమా అద్భుతమైన విజయం సాధిస్తుంది. రెండు కోట్లు పెట్టి తీసిన ‘హనుమాన్ అంశ్’ రూ. 400 కోట్లు వసూలు చేయడం మామూలు విషయం కాదు. ఈ మూవీని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం మాకు ఇచ్చిన హోంబలే ఫిల్మ్స్‌కి థ్యాంక్స్. పిల్లలందరితో కలిసి తప్పకుండా థియేటర్లలో చూడాల్సిన సినిమా ఇది. తెలుగులోనూ చాలా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత వై. రవిశంకర్ అన్నారు.
శోభినవ్ సత్య లీడ్ రోల్‌లో విశాల్ చతుర్వేది రచన, దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్ అంశ్’. విశాల్ చతుర్వేది, నమ్రత జి. సింగ్, అనుప్రియ నాగర్, రాగిణి సోనా నిర్మించిన ఈ హిందీ చిత్రం ఆగస్టు 7న బాలీవుడ్‌లో విడుదలై, హిట్‌గా నిలిచింది. ఈ మూవీ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్, సౌత్ ఇండియన్ భాషల థియేట్రికల్ రిలీజ్ హక్కులను హోంబలే ఫిల్మ్స్ సొంతం చేసుకుంది. ఈ నెల 9న తెలుగులో మైత్రి మూవీస్ రిలీజ్ చేస్తోంది.
ఈ సందర్భంగా బుధవారం నిర్వహించిన సమావేశంలో శోభినవ్ సత్య మాట్లాడుతూ– ‘‘హనుమాన్ అంశ్’ భారతీయల సినిమా. తెలుగు ప్రేక్షకులందరూ చూసి, ఈ సినిమా గురించి అందరితో చె΄్పాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. విశాల్ చతుర్వేది మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు థియేటర్లలో ఆస్వాదించాలని కోరుకుంటున్నాను’’ అని చె΄్పారు. ‘‘ఉత్తరాదిలో ఈ సినిమా ఎంత గొప్ప విజయాన్ని సాధించిందో, తెలుగులోనూ అంతే గొప్ప విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని ప్రొడ్యూసర్ రాగిణి పేర్కొన్నారు.


