అక్కడ బ్లాక్‌బస్టర్‌.. తెలుగులో డిజాస్టర్‌..! | Hanuman Ansh Collections In Tollywood In Just three Days | Sakshi
Sakshi News home page

Hanuman Ansh Movie: అక్కడ బ్లాక్‌బస్టర్‌.. ఇక్కడ చూస్తే డిజాస్టర్‌..!

Oct 12 2026 1:30 PM | Updated on Oct 12 2026 1:35 PM

Hanuman Ansh Collections In Tollywood In Just three Days

చిన్న సినిమాగా వచ్చిన బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సినిమా హనుమాన్ అంశ్. బాలీవుడ్‌లో తెరకెక్కించిన ఈ చిత్రం ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. కేవలం మౌత్‌టాక్‌తోనే హిందీలో కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబట్టింది.

బాలీవుడ్‌లో సూపర్ హిట్‌ అయిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. హోంబలే ఫిల్మ్స్‌ ఆధ్వర్వంలో ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేశారు. ఈ నెల 9న విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోతోంది. తొలి మూడు రోజుల్లో కేవలం రూ.2 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. హిందీలో వసూళ్లపరంగా దూసుకెళ్లిన ఈ మూవీ.. తెలుగులో వచ్చేసరికి అంతగా ఆదరణ దక్కించుకోలేకపోయింది.

రిలీజ్ ఆలస్యం వల్లేనా?

హిందీలో రిలీజైన రెండు నెలల తర్వాత రిలీజ్‌ చేయడం.. వసూళ్లపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. మొదట త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తారని వార్తలొచ్చాయి. కానీ కుదరలేదు. ఆ తర్వాత హోంబలే ఫిల్మ్స్‌ ఆధ్వర్వంలో విడుదల చేశారు. రిలీజ్ ఆలస్యం కావడం.. ప్రమోషన్స్‌ పెద్దగా చేయకపోవడంతో తెలుగు ఆడియన్స్‌ ఈ సినిమాకు దూరమైనట్లు తెలుస్తోంది. కాగా.. విశాల్ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శోభినావ్ సత్య ప్రధాన పాత్రలో నటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement