వార్‌కు రెడీ! | Jr NTR joins Hrithik Roshan in War 2 | Sakshi
Sakshi News home page

వార్‌కు రెడీ!

Apr 8 2024 12:32 AM | Updated on Apr 8 2024 11:19 AM

Jr NTR joins Hrithik Roshan in War 2 - Sakshi

బాలీవుడ్‌ ‘వార్‌’కు రెడీ అవుతున్నారు ఎన్టీఆర్‌. హృతిక్‌రోషన్, ఎన్టీఆర్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘వార్‌ 2’. 2019లో హిట్‌గా నిలిచిన హిందీ చిత్రం ‘వార్‌’కు సీక్వెల్‌గా ‘వార్‌ 2’ తెరకెక్కుతోంది. ‘వార్‌’కి సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించగా, ‘వార్‌ 2’కు ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్‌ అయాన్‌ ముఖర్జీ దర్శకుడు. ఇప్పటికే ‘వార్‌ 2’ చిత్రీకరణ మొదలైందని, హృతిక్‌రోషన్‌ పాల్గొనగా కొంత చిత్రీకరణ కూడా జరిపారని టాక్‌.

కాగా ఈ వారంలో ‘వార్‌ 2’ సెట్స్‌లో ఎన్టీఆర్‌ జాయిన్‌ అవుతారని బాలీవుడ్‌ సమాచారం. ఎన్టీఆర్‌పై ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను ప్లాన్‌ చేశారట అయాన్‌ ముఖర్జీ. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా కనిపిస్తారని టాక్‌. ‘వైఆర్‌ఎఫ్‌’ (యశ్‌రాజ్‌ ఫిలింస్‌) స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న ఈ సినిమాను ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. ‘వార్‌ 2’ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే చిత్రయూనిట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement