ఎన్టీఆర్‌ 'వార్‌ 2' టీజర్‌ విడుదల.. యుద్ధానికి సిద్ధమా..? | Jr NTR War 2 Movie Glimpse Out Now | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ 'వార్‌ 2' టీజర్‌ విడుదల.. యుద్ధానికి సిద్ధమా..?

May 20 2025 11:00 AM | Updated on May 20 2025 11:23 AM

Jr NTR War 2 Movie Glimpse Out Now

మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌, యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజు కానుక వచ్చేసింది. హృతిక్‌ రోషన్, ఎన్టీఆర్‌ నటించిన హిందీ చిత్రం ‘వార్‌ 2’ నుంచి   అదిరిపోయే టీజర్‌ విడుదలైంది. తారక్‌ను ప్రధానంగా హైలెట్‌ చేస్తూ వీడియో ఉండటంతో  ఆయన ఫ్యాన్స్‌ వైరల్‌‌ చేస్తున్నారు. ఇందులో తారక్‌ కిల్లర్‌ బాడీకి హృతిక్‌ రోషన్ లుక్స్‌ తోడు కావడంతో అటు బాలీవుడ్‌ను కూడా ఊపేయడం ఖాయమని చెప్పవచ్చు. టీజర్‌ను చూస్తే భారీ యాక్షన్‌ సీన్స్‌తో ఆకట్టుకునేలా సినిమా ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది.  తాజాగా తెలుగు, హిందీ, తమిళ్‌ వర్షన్‌లో టీజర్‌ విడుదలైంది. అయితే, అన్ని భాషల్లో కూడా తారక్‌నే డబ్బింగ్‌ చెప్పాడు.

ఈ ఏడాది ఆగస్టు 14న ఈ చిత్రం విడుదల కానుంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో  ఆదిత్యా చోప్రా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా  కియారా అద్వానీ నటిస్తున్నారు.

వార్‌తో ‘ఎన్టీఆర్‌ నీల్‌’కు బ్రేక్‌
ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘ఎన్టీఆర్‌ నీల్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) నుంచి ఎలాంటి అప్డేట్‌ లేదు. ‘వార్‌ 2’ నుంచి  అప్‌డేట్‌ రావడంతో ‘ఎన్టీఆర్‌ నీల్‌’ అప్‌డేట్‌ని పోస్ట్‌పోన్‌ చేసినట్లు ప్రకటించారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో గుల్షన్‌ కుమార్, భూషణ్‌ కుమార్, టి. సిరీస్‌ ఫిల్మ్స్‌ సమర్పణలో కల్యాణ్‌ రామ్‌ నందమూరి, నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026 జూన్‌ 25న రిలీజ్‌ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement