ఏంటి..నన్ను మిస్‌ అవుతున్నారా? : నాగవంశీ | Producer Suryadevara Naga Vamsi Latest Social Media Post Goes Viral, Check Netizens Reactions Inside | Sakshi
Sakshi News home page

‘వార్‌ 2’పై ట్రోలింగ్‌.. నాగవంశీ మాస్‌ ట్వీట్‌

Aug 21 2025 8:55 AM | Updated on Aug 21 2025 10:01 AM

Producer Suryadevara Naga Vamsi Latest Social Media Post Goes Viral

ఒక సినిమాని ప్రమోట్‌ చేయాలంటే హీరోహీరోయిన్లు రంగంలోకి దిగాల్సిందే. వాళ్లు ప్రచారం చేస్తేనే సినిమా జనాల్లోకి వెళ్తుంది. అందుకే ఎక్కువగా నటీనటులతోనే మీడియా సమావేశాలు, ఇంటర్వ్యూలు పెడుతుంటారు. వీరితో పాటు నిర్మాతలు, దర్శకులు కూడా ప్రచారంలో పాల్గొంటారు. కానీ వారి ప్రసంగాలు, ఇంటర్వ్యూలు అంతగా వైరల్‌ కావు. కానీ ఈ నిర్మాత మాత్రం కాస్త స్పెషల్‌. ఆయన ఏం మాట్లాడినా.. ట్వీట్‌ చేసిన క్షణాల్లో వైరల్‌ అయిపోతుంది. 

హీరోహీరోయిన్లు ఉన్నప్పటికీ.. పక్కన ఆయన ఉంటే మీడియా ఫోకస్‌ అంతా అటువైపే ఉంటుంది. సినిమా ప్రమోషన్స్‌లో ఆయన చెప్పే విషయాలు, ఇచ్చే హైప్మామలుగా ఉండదు. కొన్నిసార్లు అవసరానికి మించిన హైప్ఇచ్చి.. ట్రోలింగ్కి కూడా గురవుతుండాడు. ఆయనే యంగ్ప్రొడ్యూసర్సూర్యదేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi ).

సితారఎంటర్టైన్మెంట్బ్యానర్పై వరుస సినిమాలను నిర్మిస్తూ టాలీవుడ్లో దూసుకెళ్తున్నాడు. మొన్నటి వరకు వరుస విజయాలను చూసిన నాగవంశీకి ఇటీవల మాత్రం దెబ్బ మీద దెబ్బలు తాకుతున్నాయి. ఆయన నిర్మించిన చిత్రాలతో పాటు భారీ ధరకు కొనుగోలు చేసిన సినిమాలు సైతం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోతున్నాయి

ఆయన బ్యానర్నుంచి భారీ అంచనాలతో రిలీజైనకింగ్డమ్‌’ మూవీకి హిట్టాక్వచ్చినా.. కలెక్షన్స్మాత్రం స్థాయిలో రాబట్టలేకపోయింది. ఇక భారీ ధరకు కొనుగోలు చేసిన వార్‌ 2 చిత్రం కూడా నాగవంశీకి నష్టాలనే మిగిల్చింది. అయితే సినిమా ఫలితంతో సంబంధం లేకుండా సోషల్మీడియాలో యాక్టివ్గా ఉండే వంశీ​... వార్‌ 2 రిలీజ్తర్వాత సైలెంట్అయిపోయాడు. ఆయనపై పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ జరుగుతున్నా స్పందించలేదు. ఒకనొక దశలో సోషల్‌ మీడియాను దూరం పెట్టాడనే పుకార్లు కూడా వచ్చాయి.  

అయితే అందులో వాస్తవం లేదని వంశీ క్లారిటీ ఇచ్చాడు.  అంతేకాదు తనను ట్రోలింగ్‌ చేస్తున్నవారికి కూడా గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. తను ఎక్కడికి వెళ్లడం లేదని, ఇంకో 10-15 ఏళ్లు ఇండస్ట్రీలోనే ఉంటానని క్లారిటీ ఇచ్చాడు. 

' ఏంటి.. నన్నుచాలా మిస్ అవుతున్నట్లు ఉన్నారు. వంశీ అది.. వంశీ ఇది అని గ్రిప్పింగ్ తో ఫుల్ల్ హడావిడి నడుస్తుంది. పర్లేదు. ఎక్స్ లో మంచి రైటర్స్ ఉన్నారు. మిమ్మల్ని డిజప్పాయింట్ చేసినందుకు నన్ను క్షమించండి. కానీ, ఇంకా ఆ సమయం రాలేదు. మినిమమ్ 10 నుంచి 15 ఏళ్లు ఉంది. సినిమాలోనే.. సినిమా కోసం ఎల్లప్పుడూ. మాస్ జాతర అప్డేట్ తో త్వరలో మళ్లీ కలుద్దాం ' అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement