
జూనియర్ ఎన్టీఆర్ పేరు చెబితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు కాలర్ ఎగరేస్తారు.. ముఖ్యంగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. జపాన్‌లో ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి భారత సినీ ఇండస్ట్రీనే ఆశ్చర్యపోయింది. ఏకంగా ఆయన పేరుతో అక్కడ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఏర్పాటు అయ్యాయి అంటే ఎవరికైనా అర్థం అయిపోతుంది. తారక్ నటించిన పలు సినిమాల్లోని పాటలకు జపాన్‌లోని హీరో మునిరు, అశాహి ససాకీలతో పాటు అభిమానులు డ్యాన్సులు చేశారు. వాటికి మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. అయితే, ఇప్పుడు వార్2 సినిమా చూసేందుకు జపాన్ నుంచి తారక్ అభిమాని ఇండియాకు వచ్చింది. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
జపాన్‌కు చెందిన 'క్రిసో' వార్2 చిత్రాన్ని చూసేందుకు భారత్ వచ్చింది. ఢిల్లీ ఎయిపోర్ట్‌లో తారక్ ఫోటోతో ఉన్న టీ షర్ట్ ధరించి ఆమె కనిపించింది. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఆమెను పలకరించారు. ఇండియా ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తే.. ఆమె ఇలా చెప్పింది. ' నేను ఎన్టీఆర్‌కు చాలా పెద్ద అభిమానిని, ఆయన సినిమా చూసేందుకే ఇండియా వచ్చాను. ఆయన నటించిన సినిమా ఏదైనా సరే భారత్‌లో చూడాలని ఇక్కడికి వస్తుంటాను. గతంలో కూడా వచ్చాను.' అని పంచుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
జపాన్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఆయన ఎనర్జిటిక్ డ్యాన్స్‌లు, యాక్షన్ సీన్స్‌కి అక్కడి ప్రేక్షకులు బాగా ఆకర్షితులవుతున్నారు. ‘బాద్‌షా’ సినిమాకే జపాన్‌లో ఫ్యాన్స్ ఉండగా.. ‘ఆర్ఆర్ఆర్’తో ఆయనకు గ్లోబల్ రేంజ్‌లో గుర్తింపు వచ్చింది. దేవర సినిమా విడుదల సమయంలో ఎన్టీఆర్ కూడా జపాన్ వెళ్లి తన అభిమానులను కలుసుకున్నారు.