
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ వార్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాలో బాలీవుడ్ అరంగేట్రం చేసిన తారక్.. అభిమానులను మరోసారి బిగ్ స్క్రీన్‌పై అలరించాడ. దేవర తర్వాత వస్తోన్న చిత్రం కావడంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ రోజే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద అలరిస్తోంది. జూనియర్ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఫ్యాన్స్ థియేటర్ల వద్ద హల్ చల్ చేశారు.
ఓ అభిమాని అయితే ఏకంగా తన రక్తంతో వీరతిలకం దిద్దారు. తన చేతి వేలి రక్తాన్ని ఎన్టీఆర్ పోస్టర్‌కు తిలకం దిద్దుతూ తన అభిమానాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ అతన్ని చూసి షాకవుతున్నారు. మరి ఇంత పిచ్చేంట్రా సామీ అంటూ విమర్శిస్తున్నారు. ఎంత అభిమానులు ఇలాంటి చర్యలు చేయడం కరెక్ట్ కాదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇవాళ థియేటర్లలో విడుదలైన వార్ -2కు బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా మెప్పించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా రజినీకాంత్ కూలీతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతోంది. ఈ మూవీ యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో తెరకెక్కించారు.