
టాలీవుడ్ సినిమాలకు కేవలం తెలుగు రాష్ట్రాలతో పాటు మనదేశంలోనూ క్రేజ్ ఉంది. ఇప్పటికే తెలుగు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటింది. మనదేశంలో అత్యంత ఆదరణ దక్కించుకుంటోన్న ఇండస్ట్రీలో మన సినిమాలే ముందుంటాయి. ఇక విదేశాల్లోనూ మన చిత్రాలకు ఉన్న క్రేజ్ వేరే లెవెల్. ఇక జపాన్ ప్రజలైతే ఇండియన్ సినిమాలంటే పడి చచ్చిపోతారు. ముఖ్యంగా టాలీవుడ్ సినిమాలకు అక్కడ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికే పలు టాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలు జపాన్లో విడుదల చేశారు. జపాన్కు చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఏకంగా తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నేపథ్యంలోనే మరో టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాన్ని జపాన్లో విడుదలైంది. అక్కినేని ఫ్యామిలీ మూడు జనరేషన్స్ నటించిన మనం సినిమా జపాన్ థియేటర్లలో సందడి చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే అక్కినేని నాగార్జున, నాగచైతన్య ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. జపాన్ ప్రజలను వారి భాషలోనే పలకరిస్తూ మాట్లాడారు. ఈ సినిమా తమ కుటుంబానికి చాలా ప్రత్యేకమైనదని అన్నారు. మీకు కూడా ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నామంటూ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో నాగ్, చైతూ జపాన్ భాషలో మాట్లాడడం విశేషం.
కాగా.. అక్కినేని ఫ్యామిలీ మూడు జనరేషన్స్‌ను కవర్ చేస్తూ వచ్చిన బ్లాక్బస్టర్ చిత్రం 'మనం'. ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరరావుతో పాటు నాగార్జున, నాగచైతన్య, అఖిల్ సైతం నటించారు. సమంత, శ్రియా శరణ్ హీరోయిన్లుగా మెప్పించిన ఈ సినిమా 2014లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. గతేడాది పదేళ్లు పూర్తి కావడంతో ఈ సినిమాను రీ రిలీజ్ కూడా చేశారు. దీంతో సమంత-నాగ చైతన్యను బిగ్ స్క్రీన్‌పై మరోసారి చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
The evergreen classic #Manam releasing in Japan on August 8th ❤️🔥
Here's the special video byte by King @iamnagarjuna & Yuvasamrat @chay_akkineni to all the audience of Japan #ANRLivesOn pic.twitter.com/Fu5gxBRhx4— Naga Chaitanya FC (@ChayAkkineni_FC) August 7, 2025