
జూనియర్ ఎన్టీఆర్-హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన చిత్రం వార్-2. ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది.
హృతిక్ రోషన్ మాట్లాడుతూ.. తారక్ మీకు అన్న నాకు తమ్ముడు అంటూ ఎన్టీఆర్ అభిమానులను మనమంతా అన్నదమ్ములం. నేను తారక్ ఈ సినిమాను మొదలు పెట్టినప్పుడు కో స్టార్స్ లానే మొదలు పెట్టాం కానీ చిత్రం ముగిసే సమయానికి సొంత అన్నదమ్ముల్లా మారిపోయాం.
ఎన్టీఆర్ అభిమానులను ఉద్ధేశిస్తూ.. నాకు మీరంతా ఒక మాట ఇవ్వాలి అదేంటంటే మీరు ఇప్పుడు ఏ విదంగా తారక్‌ను ప్రేమిస్తున్నారో అదే విదంగా ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉండాలని కోరుతున్నాను, ఎందుకంటే తారక్ దానికి అర్హుడు.
తారక్ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఏ సీన్‌నైనా తారక్ తన వంద శాతం చేస్తాడు. తను ఒక సారి నటించాక ఇంకో షార్ట్ అనేది ఉండదు. తను మళ్లీ ఆ షార్ట్‌ను చెక్ కూడా చేయడు. అంత పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది తన నటన.
అది నేను తారక్ దగ్గర నేర్చుకునాన్నను. దాన్ని నేను నా తరువాత చిత్రాల్లో చూపిస్తాను. తన 25 ఏళ్ల కెరీర్‌లో తారక్‌లో నన్ను నేను చూసుకున్నాను. మా మధ్య కొన్ని సారూప్యతలున్నాయి. తారక్ కూడా తనలో నన్ను చూసి ఉంటాడు ఎంతోకొంత అని అనుకుంటున్నాను. అలానే తారక్ మంచి చెఫ్ కూడా బిర్యానీ చాలా బాగా చేస్తాడు, తామిందరం మళ్లీ కలిసి సినిమా చేసినా చేయకపోయినా తనకు ఆ బిర్యానీ మాత్రం లైఫ్‌లాంగ్ కావాలంటూ తారక్‌ను కోరాడు.