
రజనీకాంత్ కూలీ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం. సినిమా విడుదల రోజు ఉదయం 5 గంటల షోకు అనుమతి ఇచ్చింది.
సినిమా విడుదల రోజు నుండి పది రోజుల వరకు మల్టీప్లెక్స్‌లలో రూ.100, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.75గా టికెట్ రేట్స్ పెంపు జరిగింది.
అలానే హృతిక్ రోషన్, జూ. ఎన్టీఆర్ కలిసి నటించిన వార్ 2 సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
సినిమా విడుదల రోజు ఉదయం 5 గంటల షోకు అనుమతి ఇవ్వగా దాని టికెట్ ధర 500 గా నిర్ణయించింది. వార్ 2 విడుదల రోజు నుండి పది రోజుల వరకు మల్టీప్లెక్స్‌లలో రూ.100, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.75గా టికెట్ రేట్స్ పెంపు జరిగింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది.