ఎన్టీఆర్‌, హృతిక్‌ మధ్య 'వార్‌ 2'.. ట్రైలర్‌ వచ్చేసింది | War 2 Movie Trailer Out Now | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌, హృతిక్‌ మధ్య 'వార్‌ 2'.. ట్రైలర్‌ వచ్చేసింది

Jul 25 2025 10:15 AM | Updated on Jul 25 2025 11:18 AM

War 2 Movie Trailer Out Now

ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్ నటించిన భారీ యాక్షన్సినిమా వార్‌2 ట్రైలర్వచ్చేసింది. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్‌ హిందీ చిత్ర పరిశ్రమకి పరిచయమవుతున్నారు. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌పై ఆదిత్యా చోప్రా పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ స్పై యూనివర్స్‌ ఫ్రాంచైజీలో ‘వార్‌ 2’ రాబోతోంది.  ఇద్దరు గొప్ప స్టార్స్‌ మధ్య జరిగే అద్భుత పోరాటం ఎలా ఉండబోతుందో ట్రైలర్‌లో చూపించారు. కియారా అద్వానీ కూడా యాక్షన్‌ ఎపిసోడ్స్‌లతో పాటు గ్లామర్‌ రోల్‌లో కనిపించనున్నారు.

ఈ సినిమా తెలుగు విడుదల హక్కులను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (Sithara Entertainments) సంస్థ సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులందరూ ఎంతోగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ సక్సెస్‌ఫుల్‌ ఫ్రాంచైజీ స్పై యూనివర్స్‌లో భాగంగా మరో అధ్యాయంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘పఠాన్, టైగర్‌ 3, వార్‌’ వంటి గ్లోబల్‌ హిట్‌ మూవీస్‌ తర్వాత వస్తోన్న ‘వార్‌ 2’ పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌లోనూ రిలీజ్‌ కానుందని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement