ఈ ఏడాది భారీ అంచనాలతో రిలీజైన సినిమాల్లో 'వార్ 2' ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ తొలిసారి హిందీలో చేసిన చిత్రం, హృతిక్ రోషన్ మరో హీరో కావడంతో విడుదలకు ముందు చాలా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత రిజల్ట్ మారిపోయింది. పాన్ ఇండియా లెవల్లో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. తెలుగులో ఘోరమైన నష్టాలు వచ్చాయని మొన్నీమధ్యే ఓ ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చారు.
'వార్ 2' తర్వాత ఈ స్పై యూనివర్స్ నుంచి 'ఆల్ఫా' అనే సినిమా రావాలి. ఆలియా భట్, శర్వారీ ప్రధాన పాత్రల్లో నటించగా.. ఈ మూవీని ఈ ఏడాది డిసెంబరు 25న థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు వాయిదా ప్రకటన బయటకొచ్చింది. వీఎఫ్ఎక్స్ పనులు ఇంకా పూర్తి కాలేదని, దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్ 17న చిత్రం థియేటర్లలోకి వస్తుందని అనౌన్స్ చేశారు.
(ఇదీ చదవండి: శివగామిని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఇలా మార్చేశారేంటి!)
ఇదంతా చూస్తుంటే నిర్మాణ సంస్థ రిలీజ్ విషయంలో కావాలనే ఇలా చేసిందా అనే సందేహం వస్తోంది. ఎందుకంటే 'వార్ 2' వల్ల ఈ యూనివర్స్‌పై చాలా విమర్శలు వచ్చాయి. ఒకటే స్టోరీని ఎన్నిసార్లు తిప్పితిప్పి తీస్తారా అనే కామెంట్స్ వినిపించాయి. ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి టైంలో థియేటర్లలోకి 'ఆల్ఫా' వస్తే 'వార్ 2' ఫెయిల్యూర్ ప్రభావం దీనిపై పడే అవకాశముంది. అందుకే నాలుగు నెలలు వాయిదా వేశారా అనిపిస్తుంది.
ఈ యూనివర్స్‌లో ఇప్పటివరకు ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, టైగర్ 3, పఠాన్, వార్ 2 చిత్రాలు వచ్చాయి. ఒకప్పటితో పోలిస్తే ఈ యూనివర్స్‌పై ఇప్పుడు జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు కనిపించట్లేదు. దీంతో 'ఆల్ఫా' ఫలితం అనేది నిర్మాణ సంస్థకు చాలా కీలకం. ఒకవేళ మూవీ హిట్ అయితే పర్లేదు. తేడా కొడితే మాత్రం తర్వాత అనుకున్న 'పఠాన్ vs టైగర్' లాంటివి అటకెక్కేయొచ్చు.
(ఇదీ చదవండి: ఇండస్ట్రీ వదిలేస్తా.. రాజేంద్రప్రసాద్ ఇప్పుడేమంటారు?)


