
ఈ ఏడాది ఎన్టీఆర్.. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా 'వార్ 2'. హృతిక్ రోషన్ మరో హీరోగా నటించాడు. ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర ఆకట్టుకోలేకపోయింది. తెలుగులో అయితే మరీ ఘోరమైన టాక్ వచ్చింది. హిందీలో ఓ మాదిరి కలెక్షన్స్ వచ్చాయి. గత కొన్నిరోజులుగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌పై పలు రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడ వాటికి చెక్ పెడుతూ అధికారిక ప్రకటన వెలువడింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్)
'వార్ 2' డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లలో రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీల్లో స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు అలా రేపటి(అక్టోబరు 09) నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే వారంనుంచి ఇదే తేదీన రానుందని ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే నిజమైంది. థియేటర్లలో అంతంత మాత్రంగా ఆడిన ఈ చిత్రం.. ఓటీటీలో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి?
'వార్ 2' విషయానికొస్తే.. రా మాజీ ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్)ని తమ కార్టెల్‌లో భాగం చేసుకోవాలనేది కలి అనే విలన్ ప్లాన్. దీంతో టాస్క్ పేరు చెప్పి కబీర్‌తో తనకి గాడ్ ఫాదర్ లాంటి సునీల్ లుథ్రాని చంపించేస్తారు. దీంతో కబీర్‌ని పట్టుకునేందుకు రా కొత్త చీఫ్ విక్రాంత్ కౌల్ (అనిల్ కపూర్), భారత ప్రభుత్వం సోల్జర్ విక్రమ్ చలపతి (ఎన్టీఆర్) నేతృత్వంలో ఓ టీమ్ రంగంలోకి దింపుతుంది. ఆ బృందంలో లూథ్రా కూతురు, వింగ్ కమాండర్ కావ్య లూథ్రా (కియారా అడ్వాణీ) కూడా ఉంటుంది. అసలు కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు? కబీర్‌కి విక్రమ్ ఎవరో తెలిశాక ఏం చేశాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: హిట్ సినిమా.. ఇప్పుడు మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్)
Double the rage. Double the rampage. Ready for the War? 🔥#War2OnNetflix pic.twitter.com/wkTWTIu0Wu
— Netflix India South (@Netflix_INSouth) October 8, 2025