
ఎన్టీఆర్ అభిమానులకు గుడ్‌న్యూస్... చాలా ఏళ్ల తర్వాత తమ అభిమాన హీరోను చూసే ఛాన్స్ 'వార్2' ద్వారా దొరికింది. వార్2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో భారీ ఎత్తున ఈ కార్యక్రమం జరగనుంది. ఆగష్టు 10న వేడుక నిర్వహిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ కార్యక్రమలో ఎన్టీఆర్‌తో పాటు హృతిక్ రోషన్ కూడా పాల్గొననున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఈ వేడుక ప్రారంభం కానుంది.
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి ఇద్దరు బిగ్‌స్టార్స్ వార్2 కోసం ఏకం కావడంతో సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. 'యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్'లో భాగంగా రూపొందిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఆగష్టు 14న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.