జూ.ఎన్టీఆర్, హృతిక్ రోషన్.. మధ్యలో కియారా! | Kiara Advani In NTR-Hrithik Roshan War 2 Movie | Sakshi
Sakshi News home page

NTR-Kiara Advani: కియారాకి బంపరాఫర్.. తారక్‌తో ఆ సినిమాలో!

Jun 17 2023 4:21 PM | Updated on Jun 17 2023 4:23 PM

Kiara Advani In NTR-Hrithik Roshan War 2 Movie - Sakshi

పాన్ ఇండియా ట్రెండ్ పెరిగిపోయిన తర్వాత సినిమాలకు భాషతో సంబంధం లేకుండా పోయింది. మన ప్రేక్షకులైతే అదీ ఇదీ అని తేడా లేకుండా ప్రపంచంలోని అన్ని మూవీస్ చూసేస్తున్నారు. మన హీరోలు కూడా తెలుగు వరకు మాత్రమే పరిమితమైపోకుండా ఎక్కడ ఛాన్స్ వస్తే ఆ భాషల‍్లో నటించేస్తున్నారు. అలా తారక్.. బాలీవుడ్ ఎంట్రీ గురించి ఇప్పటికే న్యూస్ వచ్చేసింది. ఇప్పుడు ఆ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది.

'ఆర్ఆర్ఆర్'లో నటించి, మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన జూ.ఎన్టీఆర్.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' చేస్తున్నాడు. నవంబరులోపు దీని షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని టాక్. ఇది పూర్తయిన వెంటనే తారక్.. బాలీవుడ్ లో 'వార్ 2'లో నటించబోతున్నాడు. అధికారికంగా బయటకు రానప్పటికీ ఇది పక్కా ఇన్ఫర్మేషన్ అని సమాచారం.

యష్ రాజ్ ఫిల్మ్స్  తీస్తున్న స్పై యూనివర్స్ లో 'వార్-2' మూవీ ఒకటి. తొలి భాగంలో హృతిక్, టైగర్ ష్రాఫ్ నటించగా.. సీక్వెల్ లో మాత్రం హృతిక్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇందులో హృతిక్ కు హీరోయిన్ గా కియారా అడ్వాణీని ఎంపిక చేశారని అంటున్నారు. అధికారికంగా చెప్పనప్పటికీ ఇదే నిజమనిపిస్తోంది. మరి ఎన్టీఆర్ సరసన ఏ హీరోయిన్ చేయనుందో అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. కియారా ప్రస్తుతం రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'లో నటిస్తోంది.

(ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రిజల్ట్.. ఇలా జరగడానికి కారణాలేంటి?)

Advertisement
 
Advertisement
Advertisement