
సకుటుంబంగా చూసే ఎన్నో చిత్రాలను రూపొందించి తెలుగు చిత్ర పరిశ్రమకు మర్చిపోలేని ఘన విజయాలు అందించిన దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి.

32 ఏళ్ల కెరీర్ లో 42 ఎవర్ గ్రీన్ మూవీస్ రూపొందించారు ఎస్వీ కృష్ణారెడ్డి.

ఈ రోజు ఆయన పుట్టినరోజు వేడుకల్ని హైదరాబాద్ ఎఫ్ఎన్ సీసీ లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, ఆమని, ఇంద్రజ, లయ, అలీ, శివాజీ రాజా, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, చంద్రబోస్, రవళి, రాజేంద్రప్రసాద్, రోజా, మురళీమోహన్, బండ్ల గణేష్, తదితరులు పాల్గొన్నారు.















