
బాలీవుడ్ నటి అవ్‌నీత్ కౌర్(Avneet Kaur) ఫ్యాన్ పేజీలోని ఒక పోస్ట్‌ను క్రికెటర్ విరాట్ కోహ్లీ( Virat Kohli) లైక్ చేయడంతో ఆ వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఇప్పుడు దాని గురించి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్( Rakul Preet Singh) మాట్లాడారు. దేశంలో మనం ఇంత కాళీగా ఉన్నామా అంటూ తనదైన స్టైల్లో కామెంట్ చేసింది. ఇలాంటి వాటిని ఎందుకు వైరల్ చేస్తారని ఆమె ప్రశ్నించారు. అవసరం లేని విషయాలకు ఎక్కువ సమయం కేటాయించడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని సూచించారు.
అవ్‌నీత్‌కౌర్ ఫ్యాన్ పేజీలోని ఒక ఫోటోను విరాట్ లైక్ చేయడంపై రకుల్ ఇలా చెప్పుకొచ్చారు. ' ఈ అంశం నన్ను చాలా బాధించింది. హమ్ బోహోత్ వేలే హై (మనమంతా ఇంత ఖాళీగా ఉన్నామా..) అనిపించింది. విరాట్ లైక్ వల్ల ఆమెకు(అవ్‌నీత్‌కౌర్) 20 లక్షల మంది ఫాలోవర్స్ కొన్ని గంటల్లోనే పెరిగారు. పొరపాటున లైక్ బటన్ ప్రెస్ అయిందని చెప్పినా కూడా పెద్ద సంఖ్యలో ఆమెను అనుసరించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కోసారి మనం కూడా పొరపాటున స్నేహితులను అన్‌ఫాలో చేయడం జరుగుతుంది. ఇలాంటివి చాలా కామన్‌గా జరిగే అంశాలు. విరాట్ కూడా వివరణ ఇచ్చారు. కానీ, విరాట్ సెలబ్రిటీ కాబట్టి ఆయనకు నచ్చిన, నచ్చని అంశాలు అన్నీ వార్తలుగా మారిపోతున్నాయి. ఆయన వ్యక్తిగత విషయాలను కూడా ఇలా వైరల్ చేయడం చాలా విచారకరమైన విషయం. సోషల్ మీడియాలో చాలామంది సమయాన్ని వృథా చేస్తున్నారు.' అని ఆమె అన్నారు.
ఆ అంశంపై కోహ్లీ వివరణ కూడా ఇవ్వడం జరిగింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫీడ్‌ను క్లియర్ చేస్తున్న క్రమంలో పొరపాటున లైక్ బటన్ ప్రెస్ అయి ఉండొచ్చని ఆయన చెప్పుకొచ్చారు. ఈ అంశంలో ఎలాంటి ఉద్దేశం లేదని కూడా చెప్పారు. అవసరంలేని ప్రచారాలు చేయకండని కూడా కోరారు.