ఒక పాత్ర కోసం సినీ తారలు ఎంతగా శ్రమిస్తారో తెలుసా? తెరపై కొన్ని నిమిషాలు కనిపించే లుక్ కోసం గంటల తరబడి మేకప్ చైర్‌లో కూర్చోవాల్సి ఉంటుంది. తాజాగా ‘రామాయణ’లో శూర్పణఖ పాత్ర పోషించిన రకుల్ ప్రీత్‌సింగ్ తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామాయణ’ నవంబరు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రకుల్ ప్రీత్‌సింగ్ శూర్పణఖ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. తాజాగా తన పాత్రకు సంబంధించిన అనుభవాలను ఆమె అభిమానులతో పంచుకున్నారు.
(చదవండి: చిరంజీవి కాకా వాయిదా.. నిర్మాత ఫుల్ క్లారిటీ..!)
‘శూర్పణఖ పాత్ర పోషించడం నా జీవితంలో ప్రత్యేకమైన ప్రయాణం. భారతీయుల సంస్కృతిలో భాగమైన రామాయణాన్ని ఇంత భారీ స్థాయిలో వెండితెరపై ఆవిష్కరించడం అద్భుతమైన అనుభూతినిచ్చింది. ఈ గొప్ప ఆలోచనను తెరపైకి తీసుకొచ్చిన నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితేశ్ తివారీకి ప్రత్యేక ధన్యవాదాలు. భారత్ నుంచి ప్రపంచానికి ఓ అద్భుతమైన చిత్రాన్ని అందించాలన్న వారి తపన, కృషి నాకెంతో స్ఫూర్తినిచ్చాయి’ అని రకుల్ తన ఇన్‌స్టా ఖాతాలో రాసుకొచ్చింది.
అయితే ఈ పోస్టులో రకుల్ చెప్పిన మరో విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. శూర్పణఖ పాత్ర కోసం తన లుక్‌ను సిద్ధం చేయడానికి మేకప్, హెయిర్, కాస్ట్యూమ్స్ బృందాలు ప్రతిరోజూ ఏకంగా నాలుగు గంటల పాటు కష్టపడేవని ఆమె వెల్లడించారు. తన లుక్‌కు వస్తున్న ప్రశంసలన్నీ ఆ టీమ్‌కే చెందుతాయని చెప్పారు.


