దీపావళి, పొంగల్ వంటి పర్వదినాల్లో ప్రముఖ కథానాయకులు నటించిన చిత్రాలు విడుదల కావడం పరిపాటి. అలా 2027 జనవరిలో పొంగల్ సందర్భంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతున్న భారీ చిత్రాల్లో నటుడు విజయ్ సేతుపతి కథా నాయకుడిగా నటించిన చిత్రం కూడా ఉండనుంది. త్యాగరాజన్ కుమార రాజా దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం పాకెట్ నావెల్. దీన్ని టైలర్ డర్డన్ అండ్ కినో ఫెస్ట్ సంస్థ నిర్మిస్తోంది.
ఈ చిత్రంలో నటి మాళవిక మోహన్ రాజ్ బి శెట్టి కిషోర్ తదితరులు ముఖ్యపాత్రలు పోస్తున్నారు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని, నిరోషా చాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. సూపర్ డీలక్స్ చిత్రం తర్వాత విజయ్ సేతుపతి, దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా కాంబోలో రూపొందుతున్న చిత్రం ఇది.
(చదవండి: కోలీవుడ్‌లో దూసుకెళ్తున్న శ్రీలీల.. మూడు బడా సినిమాలతో బిజీ బిజీ!)
దీనికి ముందుగా ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఆయనకు, దర్శకుడికి మధ్య విభేదాలు తలెత్తడంతో చిత్రం నుంచి ఇళయరాజా వైదొలిగినట్లు సమాచారం. ఇప్పుడు ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. ఆండ్రూ లూయిస్ కథ, కథనం అందించారు. ఈ చిత్రాన్ని 2027 జనవరిలో పొంగల్ సందర్భంగా విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో అధికారికంగా పేర్కొన్నా రు


