
ప్రభాస్- సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'స్పిరిట్' (Spirit Movie).. తాజాగా ఈ మూవీలో నటించబోయే హీరోయిన్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ ప్రకటన వచ్చిన సమయం నుంచి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా..? అని కొంతకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యానిమల్ సినిమా తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి పూర్తిగా స్పిరిట్ సినిమా కోసమే పనిచేస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. త్వరలో షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.
స్పిరిట్ సినిమా ప్రకటన వచ్చిన తర్వాత మొదటిసారి అధికారికంగా ఒక ప్రకటన చేశారు మేకర్స్.. ఈ మూవీలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్, దీపికా పదుకోణ్ ఆలియా భట్, రష్మికా మందన్నా సహా పలువురు తారల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే, ఆ ఛాన్స్‌ను త్రిప్తి డిమ్రీ (Tripti Dimri) అందుకుంది. తాజాగా ఇదే విషయాన్ని చెబుతూ సందీప్ ఒక పోస్ట్ షేర్ చేశారు.

సందీప్ షేర్ చేసిన పోస్టర్‌ను బట్టి చూస్తే స్పిరిట్ చిత్రాన్ని దాదాపు 9 భాషలలో విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. పోస్టర్‌లో త్రిప్తి డిమ్రీ పేరును తెలుగుతో పాటు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, ఇంగ్లీష్, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో రాశారు. యానిమల్ సినిమాతో త్రిప్తి డిమ్రీకి మంచి గుర్తింపు దక్కింది. ప్రభాస్ తన కెరీర్‌లో తొలిసారి పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్నారు. మెక్సికోలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభింస్తామని సందీప్ తెలిపారు. ఇందులో విలన్‌గా దక్షిణ కొరియా స్టార్ నటుడు మా డాంగ్ సియోక్‌ను (Ma Dong-seok) తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఆనందంలో త్రిప్తి
స్పిరిట్ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేసినందుకు త్రిప్తి డిమ్రీ కృతజ్ఞతలు తెలిపింది. 'ఈ ప్రకటన రాగానే చాలా ఆనందంలో మునిగిపోయాను. ఈ జర్నీలో నన్ను నమ్మినందుకు సదా రుణపడి ఉంటాను. మరోసారి మీ విజనరీలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్యూ సందీప్ రెడ్డి వంగా' అంటూ ఆమె తెలిపింది.
The female lead for my film is now official :-) pic.twitter.com/U7JJQqSUVa
— Sandeep Reddy Vanga (@imvangasandeep) May 24, 2025