
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం స్పిరిట్. యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రంలో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు. ఈ మూవీలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్, ఆలియా భట్, రష్మికా మందన్నా సహా పలువురు తారల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఇంకా ఎవరూ ఫైనలేజ్ కాలేదు.
అయితే తాజాగా వీరు కాకుండా మరో హీరోయిన్ పేరు నెట్టింట వైరలవుతోంది. బాలీవుడ్ భామ దీపికా పదుకొణెను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. అయితే స్పిరిట్ కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకోనుందని టాక్ వినిపిస్తోంది. అధికారికంగా ధృవీకరించనప్పటికీ ఈ మూవీకి దాదాపు రూ.20 కోట్ల పారితోషికం తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇదే నిజమైతే దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్‌గా దీపికా రికార్డ్ క్రియేట్ చేయనుంది. కాగా..ఇప్పటికే దీపికా కల్కి 2898 ఏడీ మూవీలో కనిపించారు. గతంలో ప్రియాంక చోప్రా, అలియా భట్ కూడా భారీ పారితోషికం తీసుకోబోతున్నట్లు వార్తలొచ్చాయి.
ఈ మూవీ ఫుల్ యాక్షన్-ప్యాక్డ్ కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ ఏడాదిలోనే 'స్పిరిట్' షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాను టీ సిరీస్ భూషణ్ కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా (సందీప్‌రెడ్డి వంగా సోదరుడు) భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై నిర్మించనున్నారు . వచ్చే ఏడాది చివర్లో స్పిరిట్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.