
స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) ఇటీవల తానా వేడుకల కోసం అమెరికా వెళ్లింది. మొదటి సినిమా నుంచి తెలుగు ప్రేక్షకులు తనను ఆదరిస్తూనే ఉన్నారంటూ భావోద్వేగానికి లోనైంది. తెలుగువారికి తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని పేర్కొంది. ఈ వేడుకల అనంతరం సామ్ అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
రాజ్‌తో అమెరికాలో చెట్టాపట్టాల్
అమెరికాలోని డెట్రాయిట్‌లో తనకు నచ్చిన ఫుడ్ తింటూ అక్కడి అందాలను ఆస్వాదిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో రెండు ఫోటోల్లో దర్శకుడు రాజ్ నిడిమోరు కూడా ఉండటం విశేషం! ఓ ఫోటో అయితే.. వీరిద్దరూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. రాజ్.. ఆప్యాయంగా సామ్ భుజంపై చేయి వేశాడు. అతడి సాన్నిహిత్యంలో ఉన్న సామ్ నవ్వులు చిందిస్తూ కనిపిస్తోంది. మరో ఫోటోలో రాజ్‌తో పాటు మరికొంతమంది ఫ్రెండ్స్‌తో లంచ్‌కు వెళ్లింది. ఇది చూసిన అభిమానులు.. సామ్.. రాజ్‌తో రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించేసినట్లేనని అభిప్రాయపడుతున్నారు.

ఎలా మొదలైంది?
రాజ్ నిడిమోరు (Raj Nidimoru), తన స్నేహితుడు కృష్ణతో కలిసి ద ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేశాడు. ఇందులో సమంత హీరోయిన్‌గా నటించింది. అప్పుడే వీరిమధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసినట్లు తెలుస్తోంది. తర్వాత వీరిద్దరూ సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ చేశారు. సమంత చేతిలో ఉన్న రక్త బ్రహ్మాండ్: ద బ్లడీ కింగ్‌డమ్ ప్రాజెక్టుకు సైతం రాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
పర్సనల్ లైఫ్
అయితే రాజ్‌కు ఇదివరకే పెళ్లయింది. అతడికి భార్యతో పాటు ఓ కూతురు కూడా ఉంది. త్వరలోనే రాజ్.. ఆమెకు విడాకులివ్వనున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. సమంత విషయానికి వస్తే.. 2017లో నాగచైతన్యను పెళ్లి చేసుకుంది. కొంతకాలం పాటు వీరు బాగానే కలిసున్నారు. తర్వాతేమైందో ఏమోకానీ 2021లో విడాకులు తీసుకున్నారు. అనంతరం నాగచైతన్య.. తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళను వివాహం చేసుకున్నాడు.