
తన్వి ది గ్రేట్ (Tanvi The Great) అనే చిత్రాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Droupadi Murmu) వీక్షించారు. చిత్ర యూనిట్తో కలిసి రాష్ట్రపతి భవన్‌లో ఈ సినిమాను ఆమె చూశారు. అనంతరం వారిని అభినందించారు. భారత సాయుధ దళాల ధైర్యం, త్యాగాలకు నివాళిగా ‘తన్వి ది గ్రేట్’ చిత్రాన్ని అనుపమ్ ఖేర్ (Anupam Kher) తెరకెక్కించారు. శుభాంగి దత్ టైటిల్ పాత్రలో నటించింది. ట్రైలర్‌లోనే ఆమె నటనతో అందరినీ మెప్పించింది. జులై 18న ఈ చిత్రం విడుదల కానుంది.

ఈ చిత్రం ఇప్పటికే ఈ సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శించబడింది. ఒక ఆర్మీ కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆటిజం అనే అడ్డంకిని అధిగమించి ఆర్మీలో చేరాలనే కలను ఎలా నెరవేర్చిందన్నదే ఈ కథ ప్రధాన కథాంశం. 2002లో వచ్చిన 'ఓం జై జగదీష్' సినిమా తర్వాత మళ్లీ ‘తన్వి ది గ్రేట్’ చిత్రానికి అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, అరవింద స్వామి, బొమన్ ఇరానీ, పల్లవి జోషి, నాజర్ వంటి స్టార్ నటులు ఉన్నారు. ఈ చిత్రాన్ని ఎన్‌ఎఫ్‌డీసీతో కలిసి అనుపమ్ స్టూడియోస్ నిర్మించింది.